తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: అభ్యర్ధుల వేటలో పార్టీలు
తెలంగాణ రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఏడాది మార్చి మాసంలోనే ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రధాన పార్టీలు ఇంకా ఫైనల్ చేయలేదు.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

త్వరలోనే ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో ఆ పార్టీ గెలవలేదు. రెండు దఫాల్లో ఈ స్థానం నుండి ఆ పార్టీ ఓటమినే మూటగట్టుకొంది. దీంతో ఈ స్థానంతో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు గాను టీఆర్ఎస్ నాయకత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డినే టీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా అభ్యర్ధిని నిర్ణయించాల్సి ఉంది. ఈ స్థానానికి పలువురు పోటీలో ఉన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు నేతలు ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ నాయకత్వం కమిటీని ప్రకటించింది.

మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ మూడు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సమావేశమయ్యారు.

ప్రతి 50 ఓటర్లకు ఒక్క నేతను ఇంచార్జీగా టీఆర్ఎస్ నాయకత్వం నియమించింది. తమ నియోజకవర్గాల్లో పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రచార బాధ్యతలను తమ భుజాల మీద వేసుకొన్నారు.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆయన కూడ ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

లెఫ్ట్ పార్టీలు తనకు మద్దతిస్తాయని కోదండరామ్ అభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడ తనకు మద్దతిచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు.

హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరు దాదాపుగా ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది

అయితే పార్టీ నాయకత్వం ఇంకా అధికారికంగా అభ్యర్ధులను ఫైనల్ చేయలేదు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి రాములు నాయక్ పేరు ప్రధానంగా విన్పిస్తోంది. అయితే ఈ రెండు స్థానాల నుండి ఎవరిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతోందనేది ఇంకా చర్చ సాగుతోంది.

హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి విపక్షాలు మద్దతిచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో ఉన్నారు. నాగేశ్వర్ కు సీపీఎం మద్దతును ప్రకటించింది.

ఈ రెండు స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్దమౌతోంది. హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు

.ఇదే స్థానం నుండి రామచంద్రరావు మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ క్యాడర్ లో విశ్వాసాన్ని నింపింది.