నాగార్జునసాగర్ బైపోల్స్: బీసీ ఓటు బ్యాంకుపై కేసీఆర్ కన్ను
నాగార్జునసాగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు గులాబీ బాస్ వ్యూహాాత్మకంగా అడుగులు వేస్తోంది.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.ఈ విజయంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ చీఫ్ కేంద్రీకరించారు

గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నాగార్జునాసగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ.

ఈ స్థానం నుండి బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ లేదా అదే సామాజిక వర్గానికి చెందిన గురవయ్య లేదా ఎంసీ కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి తదితరుల పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోంది.

బీసీలలో యాదవ సామాజికవర్గానికి ఈ నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లు ఉన్నాయి. దీంతో యాదవ సామాజికవర్గానికే సీటు కేటాయించాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

ఇప్పటికే పలు సర్వేలను నిర్వహించిన టీఆర్ఎస్ నాయకత్వం సరైన అభ్యర్ధి కోసం ఆరా తీస్తోంది. యాదవ సామాజికవర్గానికి చెందిన ముగ్గురు నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల ఫోన్ లో చర్చించారు.

సర్వే రిపోర్టు ఆధారంగా నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే విషయమై కూడ ఆయన స్థానిక నేతలతో చర్చించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెడ్డి, బీసీ సామాజిక వర్గాల మధ్య జరిగిన పోటీ రాజకీయంగా తమకు కలిసి వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఇదే ఫార్మూలా 2014లో విజయవంతం కాలేదు.

కాంగ్రెస్, బీజేపీలు 2018 ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపాయి. టీఆర్ఎస్ నుండి బీసీ సామాజికవర్గానికి చెందిన నోముల నర్సింహ్మయ్యను బరిలోకి దింపింది.

వామపక్షరాజకీయాల్లో పేరొందిన నర్సింహ్మయ్య ఈ స్థానంలో జానారెడ్డిని ఓడించాడు.నాగార్జునసాగర్ స్థానం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధిస్తే రెండు దఫాలు ఓటమి పాలయ్యాడు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. బీజేపీ, టీఆర్ఎస్ లు ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ తో పాటు గుర్వయ్య పేర్లను సీరియస్ గా పరిశీలిస్తోంది. నోముల నర్సింహ్మయ్య నకిరేకల్ మండలం పాలెం స్వగ్రామం.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి నోముల నర్సింహ్మయ్య స్థానికేతరుడైన 2018లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. అయితే అందరూ స్థానికేతరులేనని గతంలోనే శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ విజయం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి.

నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన గురవయ్య మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ అల్లుడు. జానారెడ్డిని 1994లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రామ్మూర్తి యాదవ్ ఓడించాడు. గుర్వయ్య, నోముల భగత్ మధ్యే సీటు కోసం ప్రధానంగా పోటీ నెలకొంది.