రేవంత్, ఉత్తమ్ మధ్య కుదిరిన సయోధ్య: ఈ నెల 28న నల్గొండలో నిరుద్యోగ సభ
రేవంత్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. ఈ నెల 28న నిరుద్యోగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ పార్టీ నేత నదీమ్ అహ్మద్ ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో నల్గొండలో రద్దు చేసిన నిరుద్యోగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
రేవంత్ రెడ్డి
ఈ నెల 28న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ సభను నిర్వహించనున్నారు. ఈ నెల 21న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ నిరసన సభను నిర్వహించనున్నట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు
రేవంత్ రెడ్డి
అయితే నల్గొండ ఎంపీగా ఉన్న తనకు తెలియకుండానే ఈ సభను ప్రకటించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రేకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 21న నల్గొండలో నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ సభను నిన్న సాయంత్రం రద్దు చేస్తున్నట్టుగా టీపీసీసీ ప్రకటించింది.
రేవంత్ రెడ్డి
ఈ విషయమై నదీమ్ అహ్మద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో నల్గొండలో నిరుద్యోగ సదస్సును నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీన మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ సభ న నిర్వహించనున్నారు
రేవంత్ రెడ్డి
పార్టీ కార్యక్రమాలు ప్రకటించే విషయంలో రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. గతంలో కూడా ఇదే తరహలో రేవంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలను ప్రకటించారని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి తీరుపై గతంలో పార్టీ సినియర్లు ఏకమై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.ఈ సమయంలో దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి పరిశీలకుడిగా వచ్చారు. రేవంత్ రెడ్డి , పార్టీ సీనియర్ల మధ్యఅగాధాన్ని పూడ్చే ప్రయత్నం చేశారు.