MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • RTC Strike : ఆర్టిసి ఉద్యోగుల సమ్మెకు ప్రధాన కారణాలివే.. ఈ స్ట్రైక్ ఎప్పుడు ముగుస్తుంది..?

RTC Strike : ఆర్టిసి ఉద్యోగుల సమ్మెకు ప్రధాన కారణాలివే.. ఈ స్ట్రైక్ ఎప్పుడు ముగుస్తుంది..?

తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులు, కార్మికుల సమ్మె అర్థరాత్రి నుండి మొదలయ్యింది. అయితే ఈ సమ్మెకు కారణాలేంటి..? ఇది ఎప్పుడు ముగిసే అవకాశాలున్నాయి..? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాాం. 

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 22 2026, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ ఆర్టిసి స్ట్రైక్
Image Credit : Gemini AI

తెలంగాణ ఆర్టిసి స్ట్రైక్

Telangana RTC Strike : తెలంగాణలో ఆర్టిసి బస్సులు ఎక్కడిక్కడ ఆగిపోయాయి... ఇవాళ (ఏప్రిల్ 22, బుధవారం) ఉదయం నుండి డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టిసి ఉద్యోగులు, కార్మికులు అర్థరాత్రి నుండి సమ్మెకు దిగడంతో బస్సులు కదలక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉదయమే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగాలు, పనులకు వెళ్లే కార్మికులు అవస్థలు పడుతున్నారు. సమ్మె గురించి తెలియని ప్రయాణికులు బస్టాండ్‌లకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఆర్టిసి ఉద్యోగుల సమ్మెకు ప్రధాన కారణమిదే...
Image Credit : TGSRTC

ఆర్టిసి ఉద్యోగుల సమ్మెకు ప్రధాన కారణమిదే...

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్లంతా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపబడటం లేదు. ఆర్టిసి ప్రభుత్వ రంగ రవాణా సంస్ధే అయినప్పటికి ఇందులో పనిచేసేవారిని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడమే తాజా సమ్మెకు ప్రధాన కారణం. 

ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని... తమకు అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సౌకర్యాలు కల్పించాలని ఆర్టిసి ఉద్యోగులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆర్టిసి ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది.. కానీ ఇప్పటివరకు ఈ హామీ నెరవేరలేదు. దీంతో ఆర్టిసిని వెంటనే ప్రభుత్వంలో కలిపేయాలనే ప్రధాన డిమాండ్ తో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.

Related Articles

Related image1
RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Related image2
RTC: ఇలా అయితే అంద‌రూ RTC బ‌స్సులే ఎక్కుతారు.. తెలంగాణ ఆర్టీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం.
35
ఆర్టిసి ఉద్యోగుల డిమాండ్లు ఇవే..
Image Credit : TGSRTC @ X

ఆర్టిసి ఉద్యోగుల డిమాండ్లు ఇవే..

తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులు ప్రభుత్వం ముందు 32 డిమాండ్లు ఉంచారు. వీటన్నింటికి అంగీకరిస్తేనే సమ్మెను విరమిస్తామని తేల్చి చెబుతున్నారు. ఇందులో ప్రధానమైనది ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్. మిగతా డిమాండ్లు ఇవే...

  • వేతన సవరణ చేపట్టాలి. అంటే ప్రస్తుతం జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో అందుకు తగినట్లుగా శాలరీలు పెంచాలని ఆర్టిసి ఉద్యోగులు కోరుతున్నారు. ఇతర విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు అలవెన్సులు, ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
  • పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. గతంలో ఇచ్చిన హామీల మేరకు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని... ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
  • తెలంగాణ ఆర్టిసిలో ప్రస్తుతం భారీగా ఖాళీలున్నాయి... వాటిని వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రతి ఏడాది భారీగా ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.. అందుకు తగినట్లుగా నియామకాలు మాత్రం జరగడం లేదు అనేది ఉద్యోగుల వాదన. దీంతో ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని అంటున్నారు. కాబట్టి వెంటనే ఖాళీలను భర్తీ చేసి ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు.
  • కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఆర్టిసి ఉద్యోగులు విధుల్లో ఉండగా మరణిస్తే వారి కుటుంబసభ్యులకు యాజమాన్యం అండగా ఉండాలని కోరుతున్నారు. ఆర్థిక సాయంతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతున్నారు.
  • కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలి, కేవలం 8 గంటల పనిని అమలుచేయాలి, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి, అద్దె బస్సులను తగ్గించి సొంత బస్సులనే నడపాలి, మహాలక్ష్మి పథకం బకాయిలను వెంటవెంటనే అందివ్వాలి... ఇలా అనేక డిమాండ్లతో ఆర్టిసి ఉద్యోగులు సమ్మె చేపట్టారు.
45
ఆర్టిసి సమ్మె ఎప్పుడు ముగుస్తుంది..?
Image Credit : TGSRTC@X

ఆర్టిసి సమ్మె ఎప్పుడు ముగుస్తుంది..?

తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులు సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరుతోంది... వారి అన్ని డిమాండ్లకు సానుకూలంగానే ఉన్నామంటోంది. అయితే ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతినిధులు, ఆర్టిసి ఉద్యోగులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి... అందువల్లే ఇవాళ అర్థరాత్రి నుండి సమ్మె ప్రారంభమయ్యింది... ఆర్టిసి బస్సులు నిలిచిపోయాయి.

అయితే ఆర్టిసి ఉద్యోగులకు చర్చించేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఆర్టిసి జేఏపి నాయకులతో ఇవాళ (ఏప్రిల్ 22న) మరోసారి చర్చలు జరపనుంది. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినా... ప్రభుత్వ హామీలకు ఉద్యోగులు సానుకూలంగా స్పందించినా సమ్మె ముగుస్తుంది. కానీ ఈసారి కూడా చర్చలు విఫలమైతే మాత్రం సమ్మె కొనసాగుతుంది... అలాంటప్పుడు ఎన్నిరోజులు ఆర్టిసి బస్సులు డిపోలకే పరిమితం అవుతాయో చెప్పలేం.

55
ప్రయాణికుల కోసం రోడ్డెక్కిన అద్దెబస్సులు..
Image Credit : our own

ప్రయాణికుల కోసం రోడ్డెక్కిన అద్దెబస్సులు..

ఆర్టిసి ఉద్యోగుల సమ్మెతో బస్సులు నడవకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది... అద్దె బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ లోని ప్రధాన బస్టాండ్ల నుండి ఈ బస్సులు నడుస్తున్నాయి. అయితే ఈ అద్దె బస్సులను ఆర్టీసీ జేఏసీ అడ్డుకోకుండా భారీగా పోలీసులను మోహరించింది. అంతేకాదు ప్రధాన బస్టాండ్ల వద్ద ఆర్టిసి కార్మికులు చేపడుతున్న ఆందోళనలు అవాంఛనీయ ఘటనలకు దారితీయకుండా పోలిస్ బందోబస్తు చేపట్టింది.

ఆర్టిసి సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ రవాణా వాహనాలను డిమాండ్ పెరిగింది. దీంతో సెట్విన్ బస్సులు, ఆటో డ్రైవర్లు ప్రయాణికుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి ఆన్లైన్ ట్యాక్సీ ల డిమాండ్ పెరగడంతో ఆటోమెటిగ్గా ధరలు కూడా పెరిగాయి. మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్లలో రద్దీ పెరిగింది. ఆర్టిసి సమ్మె ముగిసేవరకు ప్రయాణికులు ఈ తిప్పలు తప్పవు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: రెడ్ అలర్ట్.. ఇటు రెయిన్ అలర్ట్.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు !
Recommended image2
Now Playing
స్టేజి పైన డాన్స్ ఇరగదీసిన మల్లా రెడ్డి కోడలు Malla Reddy Daughter-In-Law Preethi Reddy MASS Dance
Recommended image3
Now Playing
NTR Trust 5K Run:ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5కెరన్ నారా భువనేశ్వరి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
Related Stories
Recommended image1
RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Recommended image2
RTC: ఇలా అయితే అంద‌రూ RTC బ‌స్సులే ఎక్కుతారు.. తెలంగాణ ఆర్టీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved