MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • Telangana: రేషన్ కార్డుదారులకు హెచ్చరిక… ఇంకా 3 రోజులే ఉంది.. !

Telangana: రేషన్ కార్డుదారులకు హెచ్చరిక… ఇంకా 3 రోజులే ఉంది.. !

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు హెచ్చరిక: జూన్ 30లోపు మూడు నెలల బియ్యం తీసుకోకపోతే జూలై, ఆగస్టులో రేషన్ ఇవ్వరని , అధికారులు స్పష్టం చేశారు.

2 Min read
Author : Bhavana Thota
Published : Jun 28 2025, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రేషన్ కార్డుదారులకు హెచ్చరిక
Image Credit : Gemini AI

రేషన్ కార్డుదారులకు హెచ్చరిక

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రకారం, జూన్ 30వ తేదీ (సోమవారం)లోపు అన్ని కార్డుదారులు తమకు కేటాయించిన మూడు నెలల సన్నబియ్యాన్ని తీసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత తిరిగి రేషన్ పంపిణీ సెప్టెంబరులోనే ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను ఒకేసారి సరఫరా చేస్తోంది. దీంతో లబ్ధిదారులు ఒకేసారి ఎక్కువ మొత్తంలో బియ్యం పొందుతున్నారు. అధికారుల ప్రకటన ప్రకారం, జూన్ 30 తర్వాత బియ్యం తీసుకునేందుకు ఎలాంటి అపీల్‌ అవకాశాలు ఉండవు. కాబట్టి కార్డుదారులు వెంటనే తమ సమీప రేషన్ డీలర్‌ను సంప్రదించి బియ్యం తీసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జులై, ఆగస్టు నెలల్లో
Image Credit : X

జులై, ఆగస్టు నెలల్లో

అధికారుల వివరాల ప్రకారం, జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ పంపిణీ ఉండదు. ఈ గడువులోగా రేషన్ తీసుకోని లబ్ధిదారులకు ఆ రెండు నెలల బియ్యం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఆర్థికంగా భారంగా మారే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు.

ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమంది వ్యక్తులు రేషన్ ద్వారా వచ్చిన బియ్యాన్ని బజార్లో అమ్ముతున్నారని గుర్తించి, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇటువంటి దుర్వినియోగం జరిగితే, సంబంధిత వారి రేషన్ కార్డులు రద్దు చేయవచ్చని అధికారులు హెచ్చరించారు.

35
సన్నబియ్యాన్ని ఉచితంగా
Image Credit : DH

సన్నబియ్యాన్ని ఉచితంగా

ఈసారి పంపిణీలో ప్రత్యేకత ఏమిటంటే, ప్రభుత్వం నేరుగా ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. గతంలో ఉన్న తక్కువ నాణ్యత గల బియ్యం స్థానంలో ఇప్పుడు మంచి నాణ్యత ఉన్న సన్నబియ్యం అందుతోంది. దీనిపై ప్రజల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది.ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా సజావుగా జరుగుతోంది. అయితే నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లో రేషన్ దుకాణాల వద్ద క్యూ లైన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గంటల తరబడి ప్రజలు బియ్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది.

45
మూడు నెలలకి 18 కిలోల బియ్యం
Image Credit : Getty

మూడు నెలలకి 18 కిలోల బియ్యం

ప్రతి కార్డుదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున మూడు నెలలకి 18 కిలోల బియ్యం కేటాయించారు ఇది మార్కెట్‌లో సన్నబియ్యం ధరలను కొంతవరకూ తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సరఫరా యంత్రాంగం ఈ పంపిణీ ప్రక్రియను వేగంగా నిర్వహిస్తోంది.

ఈ పంపిణీ విధానం కేంద్ర పథకానికి అనుగుణంగా అమలవుతుండగా, ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల నిత్యావసరాలను తీర్చడంలో ఇది సానుకూల మార్పుకు దారితీస్తోంది. అయినా ఇప్పటివరకు రేషన్ తీసుకోని వారు తక్షణమే డీలర్‌ను సంప్రదించి తమ హక్కును వినియోగించుకోవాలి.

55
గుర్తు పెట్టుకోండి:
Image Credit : our own

గుర్తు పెట్టుకోండి:

జూన్ 30లోపు మూడు నెలల బియ్యం తీసుకోకపోతే జూలై, ఆగస్టులో రేషన్ ఉండదు

 రేషన్ మార్కెట్‌లో అమ్మితే కార్డు రద్దు అవుతుంది

ఒక్కొక్కరికి 18 కిలోల సన్నబియ్యం ఉచితం

 జూలై 1 నుంచి పంపిణీ నిలిపివేత

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image3
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Related Stories
Recommended image1
Telangana: మొదలైన బోనాల హడావిడి...కానీ తొలి బోనం మాత్రం అక్కడి నుంచే ..ఎందుకంటే..!
Recommended image2
Telangana: మహిళా సంఘాలకు అదిరిపోయే శుభవార్త అందించిన రేవంత్‌ సర్కార్‌.. ఏకంగా రూ.15లక్షలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved