- Home
- Telangana
- ఇంటర్య్యూకు అంటెండ్ అయితేచాలు జాబ్.. రూ.8,00,000 వరకు సాలరీతో 2000 నుండి 5000 ఉద్యోగాల భర్తీ
ఇంటర్య్యూకు అంటెండ్ అయితేచాలు జాబ్.. రూ.8,00,000 వరకు సాలరీతో 2000 నుండి 5000 ఉద్యోగాల భర్తీ
Telangana Job Mela : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్. వేలాది ఉద్యోగాల భర్తీకి తెెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగబోతోంది. మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకొండి.

తెలంగాణోళ్లకు ఉద్యోగాలే ఉద్యోగాలు
Telangana Jobs : నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే కాదు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగాలను సృష్టిస్తున్నారు. అంతేకాదు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుని తమతమ జిల్లాల్లో ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి చదువుకున్న స్థానిక యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివిధ ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీల సహకారంలో మెగా జాబ్ మేళా ఏర్పాటుచేశారు.
నిరుద్యోగ యువతకు సూపర్ ఛాన్స్
ఈ శనివారం (అక్టోబర్ 28న) మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనకగల పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ మెగా జాబ్ మేళాకు వేదిక కానుందని ప్రకటించారు. ఇందులో దాదాపు 150కి పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. ఉదయం 8 గంటలనుండే అభ్యర్థుల ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభం అవుతుందని… సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే యువతీయువకులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వహకులు సూచిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగ యువత మొత్తం కలిసి 12 నుండి 13 వేలమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
We will be holding the biggest ever mega job mela in the state in Huzurnagar on Saturday, 25 October. We are expecting approximately 200 companies/ employers and over 12-13,000 unemployed youth to participate in the job mela.
Myself, District Collector, SP and Commissioner of… pic.twitter.com/GqtcrOUzwX— Uttam Kumar Reddy (@UttamINC) October 21, 2025
ఎన్నివేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు?
ఈ మెగా జాబ్ మేళాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు... తన సొంతజిల్లా యువతకు ఉద్యోగాలు కల్పించాలని భావించిన ఆయన స్వయంగా కంపెనీలతో మాట్లాడారు. దీంతో చాలా కంపెనీలు ఈ జాబ్ మేళా ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి. ఇలా దాదాపు 2000 నుండి 5000 ఉద్యోగాలను భర్తీ చేసుకోనున్నాయి కంపెనీలు.
ఉపాది, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లి చాలిచాలని జీతాలతో బ్రతకు భారంగా మార్చుకునేకంటే ఈ జాబ్ మేళా ద్వారా స్వస్థలంలో ఉద్యోగాలను పొంది హాయిగా జీవించవచ్చని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ జాబ్ మేళాలో మంచి స్పందన వస్తోందని... ఇప్పటివరకు దాదాపు 10000 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా రెండ్రోజులు సమయం ఉంది కాబట్టి మరింతమంది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలున్నాయి.
ఈ అర్హతలతో ఉద్యోగాలు
అతి తక్కువ విద్యార్హతలు అంటే టెన్త్, ఐటిఐ, ఇంటర్మీడియట్ చదివినవారు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు... వీరికి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయని నిర్వహకులు చెబుతున్నారు. ఇక డిగ్రీ, ఎంబిఏ, బిటెక్, పిజీ, ఫార్మసీ చదివినవారు మంచి హోదా, సాలరీతో కూడిన ఉద్యోగాలను పొందవచ్చని అంటున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) తో పాటు ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, బయోటెక్, డిజిటల్ మీడియా, మ్యాన్యూఫ్యాక్చరింగ్, కాల్ సెంటర్, అడ్మినిస్ట్రేషన్ తో పాటు అనేక రంగాలకు చెందిన కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. విద్యార్హలతో పాటు ఇంటర్వ్యూలో కనబర్చే ప్రదర్శన ఆదారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. కాబట్టి ఈ జామ్ మేళాలో పాల్గొనే యువతకు కాస్త ప్రిపేర్ అయితే ఉద్యోగం పక్కా.
వెంటనే దరఖాస్తు చేసుకొండి
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ (DEET), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్ (TASK) సహకారంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థుల రిజిస్ట్రేషన్ కోసం ఓ క్యూఆర్ కోడ్ ను విడుదలచేశారు... దీన్ని స్కాన్ చేసి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. లేదంటే deet.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
సాలరీ
ఈ మెగా జామ్ మేళాలో మంచి విద్యార్హతలు కలిగి, స్కిల్స్ కలిగిన యువతీయువకులు మంచి సాలరీతో జాబ్ పొందే అవకాశాలుంటాయి. ఏడాదికి రూ.2,00,000 నుండి రూ.8,00,000 జీతంలో కూడిన ఉద్యోగాలను కూడా పొందవచ్చని నిర్వహకులు చెబుతున్నాయి.
ఈ మెగా జామ్ మేళాకు సంబంధించిన మరింత సమాచారం కోసం హెచ్ఆర్ ఆండ్ హెల్ప్ లైన్ నంబర్ 9000937805 కి లేదా 9848997050 లేదా 9848409466 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.