Telangana Jobs : కేవలం పదో తరగతి పాసైతే చాలు ... కోర్టులో ఉద్యోగం, రేపే చివరితేదీ
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. న్యాయశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రేపే దరఖాస్తుకు చివరితేది... వెంటనే అప్లై చేయండి.
Telangana Jobs
Telangana Jobs : తెలంగాణ న్యాయశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా లీగర్ సర్విస్ అథారిటీలో స్టైనో , రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. గత నవంబర్ 12 నే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా నవంబర్ 13 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ రేపు శనివారం అంటే డిసెంబర్ 7వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి అన్ని అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత వెంటనే దరఖాస్తు చేసుకోవాలి... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాబ్ పొందాలని కోరుకుంటున్నాం.
ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం 1 స్టెనో/టైపిస్ట్, 1 రికార్డ్ అసిస్టెంట్ (ఓసి మహిళ) పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య చాలా తక్కువే అయినా పోటీ కూడా తక్కువగా వుండే అవకాశం వుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే తప్పకూడా ఈ ఉద్యోగాన్ని దక్కించుకోవచ్చు.
విద్యార్హతలు :
కేవలం పదో తరగతి పాసయి వుంటే చాలు ... రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ టెన్త్ కంటే ఉన్నత చదువులు కలిగినవారు ఈ ఉద్యోగాన్ని పొందితే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సమయంలో వాటిని సబ్ మిట్ చేయవచ్చు.
ఇక స్టెనో లేదా టైపిస్ట్ ఉద్యోగానికి కనీస విద్యార్హత డిగ్రీ. ఇది సైన్స్, కామర్స్, ఆర్ట్స్, లా ... ఇలా గుర్తింపుపొందిన ఏ యూనివర్సిటీ నుండి అయినా డిగ్రీ పూర్తిచేసి వుండాలి. అలాగే గవర్నమెంట్ టెక్నికల్ పరీక్షలో 120 W.P.M తో ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ చేసివుండాలి. ఇంగ్లీష్ లో హయ్యర్ గ్రేడ్ షార్ట్ హ్యాండ్ లేకుంటే లోవర్ గ్రేడ్ షార్ట్ హ్యాండ్ ను పరిగణలోకి తీసుకుంటారు. మంచి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగివుండాలి.
వయో పరిమితి :
సెప్టెంబర్ 1, 2024 నాటికి 18 ఏళ్ళ నుండి 34 ఏళ్లలోపు వయసుండాలి. అయితే ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్యుఎస్ అభ్యర్థులకు సడలింపు వుంది. ఈ కేటగిరీల అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వుంది. ఇక ఎక్స్ సర్వీస్ వారు, ఇప్పటికే లీగల్ సర్వీస్ సంస్థల్లో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్నవారికి కూడా వయో సడలింపు ఇచ్చారు.
application
దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ కు సంబంధత అర్హతాపత్రాలు జతచేసి 'Chairman, District Legal Services Authority , Nyaya Seva Sadan, District Court Premises, Sangareddy' అడ్రస్ కు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ చేయాలి. ఎన్వలప్ పై 'Application for the Post OF__________.'' అని పేర్కొనాలి. కేవలం పోస్ట్, కొరియర్ ద్వారానే దరఖాస్తును స్వీకరిస్తారు... నేరుగా స్వీకరించరు. డిసెంబర్ 7 అంటే రేపు సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తారు.
ఈ పోస్టులను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఓసి, బిసి అభ్యర్థులు రూ.800, ఎస్సి, ఎస్టి అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ''The Secretary, District Legal Services Authority, Sangareddy' కి డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి. ఒక్కసారి పరీక్ష ఫీజు చెల్లించాక ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయినా, రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రద్దయినా రీఫండ్ చేయబడదు.
పరీక్షా విధానం :
స్టెనో లేదా టైపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి రాతపరీక్ష వుంటుంది. 40 మార్కులకు అబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వుంటాయి. ఇందులో 20 జనరల్ నాలెడ్జ్, 20 జనరల్ ఇంగ్లీష్ పై ప్రశ్నలుంటాయి. 45 నిమిషాల్లో పరీక్ష పూర్తవుతుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ వుంటుంది... అంటే ఇంటర్వ్యూ అన్నమాట. ఇది 20 మార్కులకు వుంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించినవారికే స్కిల్ టెస్ట్ వుంటుంది.
అభ్యర్థులకు ఇంకా ఏదయినా సందేహాలున్నా, అప్ డేట్స్ కోసం డిస్ట్రిక్ కోర్ట్స్ వెబ్ సైట్ ను పరిశీలించండి.