MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • రూ.1,37,050 జీతంతో 1623 గవర్నమెంట్ జాబ్స్, రాతపరీక్ష లేకుండానే భర్తీ.. తెలంగాణ యువతకు బంపరాఫర్

రూ.1,37,050 జీతంతో 1623 గవర్నమెంట్ జాబ్స్, రాతపరీక్ష లేకుండానే భర్తీ.. తెలంగాణ యువతకు బంపరాఫర్

తెలంగాణ యువతకు గుడ్ న్యూస్... వైద్యారోగ్య శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి డిటెయిల్స్ ఇక్కడ అందిస్తున్నాం. 

2 Min read
Arun Kumar P
Published : Aug 22 2025, 08:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారీ ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Image Credit : Getty

భారీ ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Telangana Jobs Notification : తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)లో స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, ఆర్టిసిలో స్పెషలిస్ట్ మెడికల్ ఆపీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తంగా 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.

అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, ఈఎన్టి, రేడియాలజీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైక్రియాటిస్ట్, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయో కెమిస్ట్రీ విభాగాల్లో 1616 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి TVVP లో భర్తీచేయనున్న స్పెషలిస్ట్ పోస్టులు. ఇక తెలంగాణ ఆర్టిసిలో అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఆప్థల్మాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, పల్మనాలజీ, రేడియాలజీ విభాగాల్లో మరో 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

26
ముఖ్యమైన తేదీలు
Image Credit : Getty

ముఖ్యమైన తేదీలు

ఆగస్ట్ 22న అంటే ఇవాళ(శుక్రవారం) నోటిఫికేషన్ విడుదులచేసినా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మాత్రం వచ్చేనెల సెప్టెంబర్ నుండి ప్రారంభించనున్నట్లు నోటీఫికేషన్ లో పేర్కొన్నారు. అన్ని అర్హతలు గల అభ్యర్థులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08 సెప్టెంబర్ 2025

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 22 సెప్టెంబర్ 2025, సాయంత్రం 5 గంటలవరకు.

దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే సవరించుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తారు. 23 సెప్టెంబర్ 2025 రోజు ఉదయం 10.30 నుండి 24 సెప్టెంబర్ 2025 రోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల ఎడిటింగ్ కు అవకాశం కల్పించారు.

Related Articles

Related image1
Bank Jobs : నెలకు రూ.90,000 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో మేనేజర్ జాబ్స్... వెంటనే అప్లై చేసుకొండి
Related image2
Railway Jobs : మీకు ఈ అర్హతలుంటే... రైల్వేలో రూ.40,000 పైగా సాలరీతో ఉద్యోగం
36
అప్లికేషన్ ఫీజు
Image Credit : Getty

అప్లికేషన్ ఫీజు

ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి ఆన్లైన్ లో రూ.500 ఫీజు చెల్లించాలి. అలాగే మరో రూ.200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు ఈ ప్రాసెసింగ్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

https://mhsrb.telangana.gov.in పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

46
ఎంపిక విధానం
Image Credit : Getty

ఎంపిక విధానం

ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. అయితే అకడమిక్ సమయంలో సాధించిన మార్కులతో పాటు అనేక అంశాల ఆధారంగా 100 పాయింట్లను కేటాయిస్తారు. వీటి ఆధారంగానే మెరిట్ లిస్ట్ రూపొందించి ఉద్యోగాలకు భర్తీ చేస్తారు.

56
విద్యార్హతలు
Image Credit : stockPhoto

విద్యార్హతలు

అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లమా లేదా డిఎన్డి పూర్తిచేసివుండాలి. అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.

వయోపరిమితి :

దరఖాస్తుదారులు 01/07/2025 నాటికి 18 ఏళ్లనుండి 46 ఏళ్ళలోపు ఉండాలి. అయితే ఎస్సి, ఎస్టి, బిసి అభ్యర్థులకు 5, వికలాంగులకు 10, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసేవారికి 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది.

66
సాలరీ
Image Credit : Gemini

సాలరీ

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగాలకు రూ.58,850 నుండి రూ.1,37,050 వరకు ఉంటుంది.

ఆర్టిసి పోస్టులకు రూ.56,500 నుండి రూ.1,31,000 వరకు ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
విద్య
హైదరాబాద్
అనుముల రేవంత్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Recommended image2
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Recommended image3
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Related Stories
Recommended image1
Bank Jobs : నెలకు రూ.90,000 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో మేనేజర్ జాబ్స్... వెంటనే అప్లై చేసుకొండి
Recommended image2
Railway Jobs : మీకు ఈ అర్హతలుంటే... రైల్వేలో రూ.40,000 పైగా సాలరీతో ఉద్యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved