MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • రేవంత్ రెడ్డి : తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతం కట్

రేవంత్ రెడ్డి : తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతం కట్

CM Revanth Reddy : తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 10-15% కోత విధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆ మొత్తం వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 19 2025, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
Image Credit : X/revanth_anumula

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తూ, ఆయన కొత్త చట్టానికి సంకేతాలు ఇచ్చారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనంలో 10 నుండి 15 శాతం వరకు కోత విధిస్తామని హెచ్చరించారు. ఆ మొత్తం నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేసే చట్టాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. “పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేయడం, తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఉద్యోగి కర్తవ్యం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తల్లిదండ్రుల కోసం కొత్త చట్టం
Image Credit : X/revanth_anumula

తల్లిదండ్రుల కోసం కొత్త చట్టం

“ఉద్యోగులు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే, జీతంలో కోత విధిస్తాం. మీరు ఒకటో తేదీన జీతం పొందినట్లే, అదే రోజు మీ తల్లిదండ్రుల ఖాతాలో ఆ మొత్తం జమ అవుతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రత్యేక చట్టం అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఈ ఆలోచన సమాజంలో సానుకూల మార్పును తీసుకువస్తుందని, వృద్ధుల జీవన స్థితిని మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీఎం సూచన మేరకు అధికారులు ఈ చట్టంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ, తగిన నివేదికను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు.

Related Articles

Related image1
ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండం మూడూ ముంచుకొస్తున్నాయి.. ఇక భారీ వర్షాలతో అల్లకల్లోలమే
Related image2
దీపావళి గిఫ్ట్ ! మీ ఖాతాలోకి రూ. 2000
35
తెలంగాణ ఉద్యమ త్యాగాలను గుర్తు చేసిన రేవంత్
Image Credit : X/revanth_anumula

తెలంగాణ ఉద్యమ త్యాగాలను గుర్తు చేసిన రేవంత్

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం సాధనలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, యాదయ్య వంటి ఉద్యమకారులను స్మరించారు. “వేలాది విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో ఉంటూ తెలంగాణ కోసం పోరాడారు. కానీ ఆ సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అంటూ ప్రజలను మోసం చేశారు” అని ఆయన విమర్శించారు.

గత పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించడంపై కన్నా తమ కుటుంబాల సంపద పైనే ఎక్కువ దృష్టి పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “వారి పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులు విఫలమయ్యాయి. లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోవడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు” అని మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు గుప్పించారు.

45
కొత్త ఉద్యోగులకు సీఎం సూచనలు
Image Credit : X/revanth_anumula

కొత్త ఉద్యోగులకు సీఎం సూచనలు

“ఇప్పటి వరకు మీరు సామాన్యులు, ఇకమీదట అధికారులు. మీ బాధ్యత Telangana Rising 2047 విజన్‌కు అనుగుణంగా పనిచేయడం” అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే, ఉద్యోగులకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ.. “నిస్సహాయులకు సహాయం చేయండి, పేదలకు అండగా ఉండండి. తల్లిదండ్రుల సేవే నిజమైన పుణ్యం” అని పిలుపునిచ్చారు.

అదే కార్యక్రమంలో సీఎం, విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. “హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటే కొందరు రాజకీయ నాయకులు సంతోషపడుతున్నారు. అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండండి. విద్యార్థుల ప్రాణాలు కాపాడటమే మీ మొదటి కర్తవ్యం” అని సూచించారు.

55
భవిష్యత్ నియామకాలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Image Credit : X/revanth_anumula

భవిష్యత్ నియామకాలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

సీఎం రేవంత్ నియామకాలపై మాట్లాడుతూ.. గ్రూప్-1 ఫలితాలను దసరాకు ముందు విడుదల చేశామని, ఇప్పుడు దీపావళికి ముందు గ్రూప్-2 నియామకాలు పూర్తిచేశామని తెలిపారు. త్వరలో గ్రూప్-3, గ్రూప్-4 ఫలితాలను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే 60 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చిందని గర్వంగా చెప్పారు.

“రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరంతా మట్టిలో మాణిక్యాల్లా మెరవాలని ఆశిస్తున్నాను. కష్టపడి పనిచేసి తెలంగాణను దేశంలో ఆదర్శంగా నిలపండి” అని సీఎం ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
అనుముల రేవంత్ రెడ్డి
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image3
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Related Stories
Recommended image1
ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండం మూడూ ముంచుకొస్తున్నాయి.. ఇక భారీ వర్షాలతో అల్లకల్లోలమే
Recommended image2
దీపావళి గిఫ్ట్ ! మీ ఖాతాలోకి రూ. 2000
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved