అక్కాచెల్లెళ్లకు సిఎం కేసీఆర్ పాదాభివందనం (ఫొటోలు)
రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్‌లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు అనుబంధాలకు ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది. సీఎం కె.చంద్రశేఖర్ రావుకు వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టారు.
15

kcr
రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మలు రాఖీ కట్టి ఆశీర్వదించారు.
25
kcr
రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు . వారు తమ సోదరుడిని ఆశీర్వదించారు.
35
kcr
అంతకుముందు ఉదయం మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌లకు వారి సోదరి , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు.
45
kcr
ప్రతి యేటా రాఖీ పండుగ నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి ఆయన అక్కలు చేరుకుని తమ సోదరుడికి రాఖీ కట్టి ఆశీర్వదిస్తూ వస్తున్నారు.
55
kcr
అంతకుముందు తెలంగాణ ఆడపడుచులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్‌ను ప్రజలంతా ప్రేమానురాగాలు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
Latest Videos