పాలనపై పట్టుకు ఒక్కో అడుగు: స్వంత టీమ్‌తో రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తన మార్కును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సమర్ధవంతమైన అధికారులను తన టీమ్ లో నియమించుకుంటున్నారు.
పాలనపై పట్టుకు ఒక్కో అడుగు: స్వంత టీమ్‌తో రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనలో తన ముద్ర కన్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పాలనపై పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్వంత టీమ్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
పాలనపై పట్టుకు ఒక్కో అడుగు: స్వంత టీమ్‌తో రేవంత్
గత ప్రభుత్వ హయంలో కీలక పదవుల్లో కాకుండా లూప్ లైన్ లో ఉన్న వారిని ఏరికోరి రేవంత్ రెడ్డి తన టీమ్ లో చేర్చుకుంటున్నారు. గతంలో ముక్కుసూటిగా, నిక్కచ్చిగా పనిచేసేతత్వం ఉన్నవారిగా పేరున్న అధికారులను రేవంత్ రెడ్డి తన టీమ్ లో సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఇంకా కొందరు అధికారులు రేవంత్ రెడ్డి టీమ్ లో చేరే అవకాశం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక శాఖల్లో పనిచేసిన అధికారులను పక్కన పెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.
పాలనపై పట్టుకు ఒక్కో అడుగు: స్వంత టీమ్‌తో రేవంత్
ఈ నెల 7వ తేదీన తెలంగాణ సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీగా బి.శివధర్ రెడ్డిని నియమించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండేళ్ల పాటు ఇంటలిజెన్స్ బాస్ గా శివధర్ రెడ్డి పనిచేశారు. అయితే ఆ తర్వాత శివధర్ రెడ్డిని కేసీఆర్ పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీగా శివధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
పాలనపై పట్టుకు ఒక్కో అడుగు: స్వంత టీమ్‌తో రేవంత్
హైద్రాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహాంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించారు.కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ముక్కుసూటి మనిషిగా పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పనిచేసిన సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు.ఆ సమయంలో ఓ రాజకీయ నేతతో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వైరం అప్పట్లో సంచలనంగా మారింది. రాచకొండ సీపీ సుధీర్ బాబు కూడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇక సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరుంది.
పాలనపై పట్టుకు ఒక్కో అడుగు: స్వంత టీమ్‌తో రేవంత్
సీఎంఓలో ఇక మరికొందరు అధికారుల నియామకం జరగాల్సి ఉంది.సీఎంఓలో అధికారుల నియామకంలో రేవంత్ రెడ్డి తన మార్కును చూపించే అవకాశం లేకపోలేదు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంఓలో పనిచేసిన అధికారులకు స్థానం దక్కకపోవచ్చనే ప్రచారం కూడ ఉంది.
పాలనపై పట్టుకు ఒక్కో అడుగు: స్వంత టీమ్‌తో రేవంత్
సీఎం సీపీఆర్ఓగా బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమించారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పీఆర్ఓగా విజయ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పాలనపై పట్టుకు ఒక్కో అడుగు: స్వంత టీమ్‌తో రేవంత్
తెలంగాణలో గత పదేళ్లలో కేసీఆర్ సర్కార్ పాలనలో ఏం జరిగిందనే అంశాలను వివరించడంతో పాటు ప్రజలకు తాము ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రేవంత్ రెడ్డి కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తన ఆలోచనలను అమలు చేసేందుకు సమర్ధవంతమైన అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన స్వంత టీమ్ ను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నారు.