MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • తెలంగాణలో ఉద్యోగాల జాతర ... అసెంబ్లీ సాక్షిగా 50 వేలకుపైగా ఉద్యోగాల హామీ, ఆడోళ్ల కోసమే స్పెషల్ జాబ్స్

తెలంగాణలో ఉద్యోగాల జాతర ... అసెంబ్లీ సాక్షిగా 50 వేలకుపైగా ఉద్యోగాల హామీ, ఆడోళ్ల కోసమే స్పెషల్ జాబ్స్

తెలంగాణ ప్రభుత్వం భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా చేసిన బడ్జెట్ 2025 ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేసారు.  

3 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 19 2025, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Telangana Jobs

Telangana Jobs

Telangana Budget 2025 : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. అసెంబ్లీ వేదికన భారీ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేసారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి తన ప్రసంగంలో ఉద్యోగాల భర్తీ గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు చేపట్టిన ఉద్యోగాల గురించి ప్రస్తావించిన మంత్రి ఇకపై చేపట్టనున్న ఉద్యోగాల భర్తీ గురించి కూడా కీలక ప్రకటన చేసారు. 

తెలంగాణ ప్రజల భూ యాజమాన్య హక్కులను కాపాడేందుకు త్వరలోనే భూభారతి ని అందుబాటులోకి తీసురానున్నట్లు ఆర్థికమంత్రి భట్టి తెలిపారు. ఈ క్రమంలోనే భూ పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి 10,954 గ్రామ స్థాయి అధికారుల పోస్టుల మంజూరు చేసినట్లు... త్వరలోనే వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇలా రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి మరింత పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

ఇక తెలంగాణలోని అన్ని అంగన్వాడీల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తామని... ఇందుకోసం భారీగా అంగన్వాడీ టీచర్లు, సహాయకుల నియామకాలు చేపడుతున్నట్లు భట్టి ప్రకటించారు. ఇప్పటికే 14,236 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన చేసామని... త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అంగన్వాడీ నియామకాలపై ఇప్పటికే స్త్రీ శిశు సంక్షేమశాఖ తీవ్ర కసరత్తు చేస్తుండగా తాజాగా ఆర్థిక మంత్రి అసెంబ్లీ వేదికన వీటిపై కీలక ప్రకటన చేసారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Telangana Jobs

Telangana Jobs

తెలంగాణలో లక్షలాది ఉద్యోగాల భర్తీ : 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోందని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అధికారం చేపట్టాక పోలీస్, రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్యారోగ్య శాఖలో మొత్తం 57,946 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసామన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో మరో 30,228 పోస్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని... ఇప్పటికే పరీక్షలను నిర్వహించి పలితాలు కూడా ప్రకటించినట్లు తెలిపారు. త్వరలోనే అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరిపోతారని ఆర్థిక మంత్రి తెలిపారు.
 
యువతలో శాస్త్ర సాంకేతిక నైపుణ్యం పెంపొందించేందకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపిస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ముచ్చర్లలో 150 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా 30 వేల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని... ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 7,227 బస్సుల్లో 149.63 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని భట్టి విక్రమార్క వెల్లడించారు. తద్వారా రూ.5005 కోట్ల రూపాయిలు మహిళలకు ఆదా అయ్యాయన్నారు. గతంలో 69 శాతం ఆక్యుపెన్సి ఉంటే ఇప్పుడు ఇది 94 శాతానికి చేరిందన్నారు. ఇలా ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం  కోసం బస్సుల సంఖ్య పెంచడమే కాదు 6,400 మంది ఉద్యోగులకు భర్తీ చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

33
Telangana Jobs

Telangana Jobs

తెలంగాణలో నిరుద్యోగిత రేటు ఎంతో తెలుసా? 

కేంద్ర గణాంక శాఖ చేపట్టిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం తెలంగాణలో 2023 జూలై-సెప్టెంబర్ కాలంలో నిరుద్యోగిత 22.9 శాతం ఉందని... అదే 2024 జూలై-సెప్టెంబర్ కాలానికి 18.1 శాతానికి తగ్గిందని భట్టి విక్రమార్క తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక చేపడుతున్న శిక్షణా కార్యక్రమాలు, భారీ ఉద్యోగ నియామకాలు, యువతకు అందిస్తున్న ప్రోత్సాహం వల్లే నిరుద్యోగం తగ్గిందన్నారు ఆర్థిక మంత్రి. 

ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ, వెనకబడిన వర్గాల యువత స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నామని... ఇది ఉపాధి కల్పనలో గేమ్ చేంజర్ గా మంత్రి పేర్కొన్నారు. ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పథకం కోసం ఆరువేల కోట్లు కేటాయించామన్నారు. అర్హులైన ప్రతి నిరుద్యోగికి రూ.4 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. 

ఇక రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రిలిమ్స్ పాసయిన అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. అలాగే మెయిన్స్ పాసయి ఇంటర్వ్యూ కోసం సన్నద్దమయ్యే సమయంలో మరో లక్ష రూపాయలు అందిస్తున్నామని... ఇలా మొత్తంగా సివిల్స్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. సింగరేణి యాజమాన్యం సహకారంతో ఈ పథకం అమలు చేస్తున్నామని మంత్రి భట్టి వెల్లడించారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా గ్రూప్-1, గ్రూప్-2 మరియు ఇత పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలోని పరిశ్రమలు 22.5 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయని...ఇందులో సేవా రంగంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలున్నాయన్నారు.  మొత్తం శ్రామిక రంగంలో 34 శాతం వాటాను సేవా రంగం కలిగివుంది. సాప్ట్ వేర్ సేవలు, ఫిన్ టెక్, లాజిస్టిక్స్, పర్యాటకం వంటి రంగాల్లో ఉపాధి వృద్ది ఎక్కువగా ఉందని... హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉందన్నారు. పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల అభివృద్ది పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved