బోనమెత్తిన సికింద్రాబాద్... మహంకాళి అమ్మవారికి తొలిబోనం తలసాని కుటుంబానిదే
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడి మొదలయ్యింది. మంత్రి తలసాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబాలు అమ్మవారికి బోనాలు సమర్పించాయి.

Secunderabad Bonalu
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాడ మాసంలో హైదరాబాద్ నగరమంతా బోనాల సందడితో నిండిపోతుంది. బోనమెత్తిన ఆడపడుచులతో పాటు శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, పలహారం బండ్ల ఊరేగింపు లతో నగరమంతా కళకళలాడుతుంది. ఈ ఆషాడమాస బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్ అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.
Secunderabad Bonalu
ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సినిమాటోగ్రపి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం ప్రతిఏడాది మాదిరిగానే ఈసారి కూడా అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. తలసాని దంపతులు పట్టువస్త్రాలు, బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకోగా అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. తొలి బోనాం సమర్పించిన అనంతరం మంత్రి దంపతులు, కుటుంబం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Secunderabad Bonalu
బోనాల ఉత్సవాల కోసం ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని పూలదండలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. సికింద్రాబాద్ ప్రజలే కాకుండా నగరంలోని ఇతరప్రాంతాలు, వివిధ జిల్లాల నుండి కూడా అమ్మవారికి దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తుతారు. కాబట్టి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు జరిగాయో లేదో మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆలయ అధికారులు, పోలీసులకు పలు సూచన చేసారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
Secunderabad Bonalu
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బోనాల ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు.బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బోనాలు తెలంగాణ రాష్ట్ర పండగగా మారిందన్నారు.
Secunderabad Bonalu
బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే దేవాలయాలకు ప్రభుత్వమే ఆర్ధిక సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయాలకే కాదు ప్రైవేట్ నిర్వహణలోని దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఇదిలావుంటే కేంద్ర మంత్రి, ఇటీవలే బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన కిషన్ రెడ్డి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా నిండుబోనంతో ఆలయానికి చేరుకున్న కిషన్ రెడ్డి దంపతులకు అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు కిషన్ రెడ్డి దంపతులు.
ఇదిలావుంటే కేంద్ర మంత్రి, ఇటీవలే బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన కిషన్ రెడ్డి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా నిండుబోనంతో ఆలయానికి చేరుకున్న కిషన్ రెడ్డి దంపతులకు అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు కిషన్ రెడ్డి దంపతులు.