MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కాంగ్రెస్ కు ఓట్లు, సీట్లు పెరిగినా... బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమట..: శ్రీ ఆత్మసాక్షి సర్వే వివరాలివి..

కాంగ్రెస్ కు ఓట్లు, సీట్లు పెరిగినా... బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమట..: శ్రీ ఆత్మసాక్షి సర్వే వివరాలివి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదంటే తమదని అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో మెజారిటీ ఎవరిదో అంచనావేస్తూ శ్రీ ఆత్మసాక్షి సర్వే బయటపెట్టింది.  

2 Min read
Arun Kumar P
Published : Oct 30 2023, 12:17 PM IST| Updated : Oct 30 2023, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Telangana Elections

Telangana Elections

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ బరిలోకి దిగుతున్నారు. ముఖ్యంగా అధికార బిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు వుండనుందని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఈ క్రమంలో కొన్ని సంస్థలు చేపడుతున్న సర్వే ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు, మరికొన్ని సర్వేలు బిఆర్ఎస్ కు మెజారిటీ వస్తుందని తేలుస్తున్నాయి. తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే స్వల్ప మెజారిటీతో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశాలున్నాయని ప్రకటించింది.   
 

27
Telangana Election

Telangana Election

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకటించింది. గత ఎన్నికలతో పోల్చితే ఓట్ షేర్ తగ్గినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ సీట్లు బిఆర్ఎస్ కు వస్తాయని తెలపింది. కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్, సీట్లు పెరిగినా అధికారాన్ని చేపట్టే స్థాయిలో వుండకపోవచ్చని అభిప్రాయపడింది.  బిజెపికి కూడా ఓట్ షేర్, సీట్లు పెరిగే అవకాశాలున్నాయని శ్రీఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. 

37
Telangana Assembly

Telangana Assembly

ఈ నెల 28 వరకు చేపట్టిన సర్వే వివరాలకు శ్రీ ఆత్మసాక్షి సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 42 శాతం ఓట్ షేర్ తో బిఆర్ఎస్ పార్టీకి   64-70 సీట్లు వస్తాయని వెల్లడించింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తూ బిఆర్ఎస్ ఓటింగ్ శాతం 4శాతం తగ్గుతుందని ఈ సర్వే తెలిపింది. 

47
Telangana Assembly

Telangana Assembly

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 37‌-43 సీట్లకే పరిమితం కానుందని ఈ సర్వే తేల్చింది. ఓట్ షేర్ మాత్రం గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా పెరగనుందని తేల్చింది.  గతంలో 28 శాతం ఓట్ షేర్ సాధిస్తే  ఈసారి 36 శాతంకు పెరగనున్నట్లు... అంటే 8 శాతం పెరుగుతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. అయితే అధికారం మాత్రం కాంగ్రెస్ కు దక్కు అవకాశాలు లేవని తేల్చారు. 

57
Telangana Assembly

Telangana Assembly

బిజెపికి కూడా ఓట్ షేర్, సీట్లు పెరిగే అవకాశాలున్నాయని ఈ సర్వే ప్రకటించింది. గత ఎన్నికల్లో 6శాతం ఓట్ షేర్ మాత్రమే సాధించిన బిజెపి ఈసారి 10శాతానికి చేరుకుంటుందని... గతంతో కేవలం ఒక్కసీటుకే పరిమితమైతే ఈసారి 6‌‌-7 వరకు సాధించవచ్చని తేల్చింది.  ఎంఐఎం కూడా 2 శాతం ఓట్ షేర్ తో 6-7 సీట్లు దక్కించుకోనుందని ఈ సర్వే తెలిపింది. ఇతరులు 1-2 సీట్లు సాధించే అవకాశాలున్నాయట. 

67
Telangana Assembly

Telangana Assembly

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుచోట్ల హోరాహోరీ వుండనుందని... ఇందులో బిఆర్ఎస్ 3, కాంగ్రెస్ 2, బిజెపి 1 చోట ఆధిక్యం సాధించవచ్చని సర్వే తేల్చింది. మొత్తంగా బిఆర్ఎస్ పార్టీదే విజయమని ఈ శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకటించింది. 
 

77
Telangana elections

Telangana elections

గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉపఎన్నికలు, ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తాము వెల్లడించిన సర్వే ఫలితాలు నిజమయ్యాయని శ్రీ ఆత్మసాక్షి సంస్థ పేర్కొంది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే చేపట్టినట్లు తెలిపారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత రాష్ట్ర సమితి
భారతీయ జనతా పార్టీ
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎకరం 151 కోట్లు : హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలోనే రికార్డు రేట్
Recommended image2
Now Playing
హైదరాబాద్‌లో రాకెట్ల తయారీ కేంద్రం.. లోపల ఎలా ఉంటుందో చూడండి | Asianet News Telugu
Recommended image3
Now Playing
Vikramaditya Engagement: భట్టి విక్రమార్క కొడుకు నిశ్చితార్థంలో జగదీశ్ రెడ్డి | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved