School Holidays : స్కూళ్లకు సెలవులు.. ఎప్పుడంటే
తెలుగు రాష్ట్రాల్లో రేపటితో వేసవి సెలవులు ముగియనున్నాయి.. ఎల్లుండి నుండి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ అకడమిక్ ఇయర్ ఎలా సాగనుంది? వచ్చే సెలవులెన్ని? తదితర వివరాాలను ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలంగాాణ చిన్నారులకు సెలవులే సెలవులు
School Holidays : దాదాపు రెండు నెలలుగా మూగబోయిన బడిగంటలు త్వరలోనే మోగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు రేపటితో (జూన్ 11) తో వేసవి సెలవులు ముగియనున్నాయి… స్కూళ్ళన్నీ తెరుచుకోనున్నాయి. ఇన్నిరోజులు సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులను ఒక్కసారిగా స్కూల్ కి వెళ్లమంటే బాధ కలుగుతుంది. కానీ వేసవితోనే సెలవులు ముగియలేదు... ఈ అకడమిక్ ఇయర్ లో ఇంకా చాలా హాలిడేస్ ఉన్నాయని విద్యార్థులు గుర్తించాలి. సెలవులు ముగియడంతో బాధపడుతున్న విద్యార్థులు తెలంగాణ విద్యాశాఖ విడుదలచేసిన అకడమిక్ క్యాలెండర్ చూస్తే ఎగిరి గంతేస్తారు.
తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ ఇదే
తెలంగాణలో జూన్ 12 నుండి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అకడమిక్ ఇయర్ (2025-26) కి సంబంధించిన ప్రణాళికలను విద్యాశాఖ రూపొందించింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుండి ముగింపు వరకు విద్యాబోధన, సిలబస్, పరీక్షలు, సెలవులు, ఇతర ముఖ్యమైన అంశాలతో కూడిన వివరాలతో అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది విద్యాశాఖ.
ఈ విద్యా సంవత్సరం 2025, జూన్ 12 నుండి 2026, ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది. అంటే ఏప్రిల్ 23, 2026 లాస్ట్ వర్కింగ్ డే.. ఆ తర్వాత దాదాపు రెండునెలలు వేసవి సెలవులుంటాయి. 2026 లో వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు కొనసాగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ అకడమిక్ ఇయర్ లో మొత్తం 230 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా అకడమిక్ క్యాలెండర్ 2025-26 కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసారు.
తెలంగాణలో ఈ విద్యాసంవత్సరంలో వచ్చే సెలవులెన్నో తెలుసా?
వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు ప్రారంభం అవుతున్నాయని విద్యార్థులకు బాధ వద్దు... ఎందుకంటే ఈ అకడమిక్ ఇయర్ భారీ సెలవులు వస్తున్నాయి. పండగలు, జాతీయ పర్వదినాలు, ఇతర వేడుకలతో పాటు వచ్చేఏడాది వేసవి సెలవులు కలుపుకుని మొత్తం విద్యాసంవత్సరంలో 135 రోజుల సెలవులు వస్తున్నాయి. సంవత్సరంలో 365 డేస్ అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూల్స్ నడిచేది కేవలం 230 రోజులు మాత్రమే.
తెలంగాణలో పెద్ద పండగ దసరా... బతుకమ్మ వేడుకలను కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ పండక్కి స్కూల్ విద్యార్థులకు భారీగా సెలవులు వస్తాయి. ఈ విద్యాసంవత్సరంలో కూడా సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నారు.
ఇక క్రిస్టియన్లు ఎంతో పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ కు డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 27 వరకు సెలవులు ఇవ్వనున్నారు... కానీ ఈ సెలవులు మిషనరీ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తించనున్నాయి... మిగతా విద్యార్థులకు రెండు రోజులే సెలవు.
వచ్చేఏడాది ఆరంభంలో అంటే జనవరి 2026 లో సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ఈ అకడమిక్ ఇయర్ లో జనవరి 11 నుండి జనవరి 15 వరకు అంటే ఐదురోజులు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇలా కీలకమైన పండగలకు భారీ సెలవులు రాగా మిగతా పండగలు, ప్రత్యేక రోజుల్లో సెలవులు రానున్నారు.
అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొనకున్నా మరిన్ని సెలవులు
తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ పేర్కొన్నట్లు 230 రోజులు వర్కింగ్ డేస్ చాలా కష్టం. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు, బంద్ లు వంటి వివిధ కారణాలతో స్కూళ్లు మూతపడవచ్చు. అంటే స్కూళ్ళకు 135 రోజులకంటే ఎక్కువగానే సెలవులు వచ్చే అవకాశం ఉంది.
గతేడాది భారీ వర్షాలు, వరదల కారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఈసారి కూడా ఇలా వర్షాలు దంచికొడితే ముందుగా స్కూళ్లకు సెలవులు ఇస్తారు. ఇలా వాతావరణ పరిస్థితుల కారణంగా స్కూళ్లకు సెలవులు పెరిగే అవకాశాలుంటాయి.
ఇక విద్యార్థి సంఘాలు, ఇతర యూనియన్స్, రాజకీయ పక్షాల బంద్ ల కారణంగా కూడా స్కూళ్లకు సెలవులు వస్తాయి. ఇక స్థానిక వేడుకలు, ఇతర పరిస్థితుల కారణంగా కొన్ని స్కూళ్ళకు ప్రత్యేక సెలవులు వస్తాయి. ఇలా మొత్తంగా అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నట్లు కేవలం 135 రోజులే కాదు... విద్యార్థులకు మరిన్ని సెలవులు వచ్చే అవకాశాలుంటాయి.
ఆంధ్ర ప్రదేశ్ అకడమిక్ క్యాలెండర్
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ కూడా అకడమిక్ క్యాలెండర్ 2025-26 విడుదల చేసింది. ఇందులో వర్కింగ్ డేస్ 233 కాగా హాలిడేస్ 83 రోజులు. వేసవి సెలవులు కూడా కలుపుకుంటే ఏపీలో కూడా సెలవుల సంఖ్య 130 కి పైగానే ఉంటుంది. సిలబస్ ఎప్పుడెలా పూర్తిచేస్తారు, పరీక్షలు ఎప్పుడుంటాయనే వివరాలతో ఈ అకడమిక్ క్యాలెండర్ ను రూపొందించారు.