తెలుగు విద్యార్థులకు గుడ్ న్యూస్ .. ఒక్కరోజు కవర్ చేస్తే వరుసగా నాల్రోజులు సెలవులే
Telangana Holidays : తెలుగు విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ రెండ్రోజులు (నవంబర్ 8,9) ఎలాగూ సెలవులే… మరో రెండ్రోజులు (నవంబర్ 10,11) కూడా సెలవులు పొందవచ్చు. ఈ అవకాశం కొందరు విద్యార్ధులకు మాత్రమే..

ఈవారం సెలవులే సెలవులు
School Holidays : సెలవులు... ఈ పదం వినగానే స్కూల్ పిల్లలకు ఎక్కడలేని ఆనందం వస్తుంది. ఎప్పుడెప్పుడు సెలవు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు... స్కూల్ కి వెళ్లకుండా హాయిగా ఇంట్లో ఉండటం, స్నేహితులతో ఆడుకోవడం, పేరెంట్స్ తో గడపడాన్ని ఇష్టపడుతుంటారు. ఇలా సెలవులు కోరుకునే విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారమిది... కేవలం ఒక్కరోజు కవర్ చేస్తే చాలు ఈ నాలుగు రోజులు సెలవులే. కానీ ఈ అవకాశం అందరు విద్యార్థులకు కాదు... కొందరికి మాత్రమే. ఏరోజు, ఎందుకు, ఎవరికి సెలవు ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో సెలవులే సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి ఈ రెండ్రోజులు (నవంబర్ 8, 9) సెలవులే. ఈ నెలలో వచ్చిన రెండో శనివారం కావడంతో ఈరోజు సెలవుంది... రేపు ఎలాగే ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు. ఇరు రాష్ట్రాల్లోనూ సోమవారం స్కూళ్లు తెరుచుకుంటాయి... యధావిధిగా నడుస్తాయి.
అయితే ఒక్క హైదరాబాద్ లో మాత్రం నవంబర్ 11, మంగళవారం కొన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంది. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కీలకమైన పోలింగ్ జరగనుంది... దీంతో ఈ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు జూబ్లిహిల్స్ అసెంబ్లీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఆరోజు సెలవు. స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పోలింగ్ బూత్ లు ఏర్పాటుచేస్తారు కాబట్టి నవంబర్ 11న జూబ్లిహిల్స్ లో అధికారిక సెలవు ప్రకటించారు.
ఒక్కరోజు కవర్ చేస్తే వరుసగా నాల్రోజులు సెలవులే
జూబ్లిహిల్స్ నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాల్రోజులు సెలవులు పొందే అద్భుత అవకాశం వచ్చింది. ఎలాగూ ఇవాళ (రెండో శనివారం), రేపు (ఆదివారం) సెలవే... సోమవారం (నవంబర్ 10న) ఒక్కరోజు కవర్ చేస్తే చాలు మళ్ళీ నవంబర్ 11 (మంగళవారం) సెలవు వస్తుంది. ఏదైనా అవసరం ఉంటే ఈ వరుస సెలవులను వాడుకోవచ్చు.
వీరికి నవంబర్ 14న కూడా సెలవే
జూబ్లిహిల్స్ అసెంబ్లీ పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసే విద్యాసంస్థలకు నవంబర్ 10న కూడా సెలవు ప్రకటించారు. అంటే కొన్ని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు వరుసగా నవంబర్ 8,9,10,11 నాల్రోజులు అధికారిక సెలవే. ఓట్ల లెక్కింపు జరిగి పలితాలు వెలువడే నవంబర్ 14న కూడా కొన్ని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు... ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటయ్యే పాఠశాలలు, కాలేజీలకు ఈ సెలవు వర్తిస్తుందని హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ఓ ప్రకటనలో తెలిపారు.
జూబ్లిహిల్స్ లో ఓటుహక్కు కలిగుంటే చాలు... ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు
కేవలం జూబ్లిహిల్స్ పరిధిలోని కార్యాలయాలు, అందులో పనిచేసే ఉద్యోగులకే కాదు ఈ నియోజకవర్గంలో ఓటుహక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ప్రకటించింది ప్రభుత్వం. అంటే ఇక్కడి ఓటర్లు ఈరోజు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఇక జూబ్లిహిల్స్ అసెంబ్లీలో నివసించే ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఓటుహక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని నగరంలోని అన్ని సంస్థలకు సూచించింది ప్రభుత్వం.