రేపట్నుంచి సెలవులే సెలవులు ... ఇక ఈ నెలలో స్కూళ్లు నడిచేది ఎన్నిరోజులో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు వచ్చేవారంలో చాలారోజులు మూసివేయబడనున్నాయి. ఎన్ని రోజుల సెలవులు వస్తున్నాయో తెలుసా?
School Holidays
School Holidays : హాలిడేస్... ఈ మాట వింటే చాలు స్కూల్ విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా ఎగిరి గంతేసారు. వీకెండ్ శని, ఆదివారం సాధారణ సెలవులకే సంబరపడిపోతారు... అలాంటిది మరో ఒకటిరెండు సెలవులు కలిసి వచ్చాయో వారి ఆనందానికి అవధులు వుండవు. తాజాగా అలాంటి సందర్భమే వచ్చింది. వచ్చేవారం మొత్తం ఒకటి తర్వాత ఒకటి హాలిడేస్ రానున్నాయి. సాధారణ సెలవులకు క్రిస్మస్ తోడవడంతో వారమంతా హాలిడేస్ తో నిండిపోయింది. ఆ తర్వాతి వారంలో కూడా మరో ప్రత్యేక సెలవు వస్తోంది.
మొత్తంగా చూసుకుంటే ఈ డిసెంబర్ లో ఇక మిగిలింది కొన్నిరోజులే. అందులో స్కూళ్లు, కాలేజీలకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో మిగిలిన 11 రోజుల్లో కొన్నిస్కూళ్లకు 7 రోజులు, మరికొన్ని స్కూళ్లకు 5 రోజుల సెలవులు వస్తున్నాయి. అంటే విద్యాసంస్థలు తెరిచివుండే రోజులకంటే మూసివుండే రోజులే ఎక్కువగా వుంటాయన్నమాట.
school holidays
వచ్చేవారం స్కూళ్లకు సెలవులు ఎన్నిరోజులు?
హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు శని, ఆదివారం రెండ్రోజులు సాధారణ సెలవు వుంటుంది. ఇలాంటి స్కూళ్ళలో విద్యార్థులకు రేపు శనివారం(డిసెంబర్ 21) నుండి సెలవులు ప్రారంభంకానున్నారు. క్రిస్మస్ పండక్కి మూడురోజులు, ఆ తర్వాత మళ్లీ వారాంతంలో రెండు... ఇలా మొత్తం ఏడురోజుల సెలవులు వస్తున్నాయి. ఆ తర్వాత జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ సందర్భంగా మరో సెలవు వస్తుంది.
అంటే డిసెంబర్ 21,22 (శని, ఆదివారం) స్కూల్స్ వుండవు. సోమవారం ఒక్కరోజు స్కూల్ కి వెళితే మళ్లీ మంగళవారం నుండి క్రిస్మస్ సెలవులు. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే. డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు. ఆ తర్వాతిరోజు డిసెంబర్ 26న బాక్సిండ్ డే కావడంతో మరో సెలవు. ఇలా వారం మధ్యలో వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి.
డిసెంబర్ 27 శుక్రవారం మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకుంటాయి. ఆ తర్వాతి రోజు అంటే డిసెంబర్ 28 మళ్లీ శనివారం, డిసెంబర్ 29 ఆదివారం. ఈ రెండురోజులు సాధారణ సెలవులే. మొత్తంగా చూసుకుంటే శని,ఆదివారం సాధారణ సెలవులుండే విద్యాసంస్థలు వచ్చే వారం కేవలం రెండ్రోజులు (సోమవారం,శుక్రవారం) మాత్రమే పనిచేయనున్నాయి.
ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, అత్యధిక ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆదివారం మాత్రమే సాధారణ సెలవు. ఈ స్కూళ్ళు, కాలేజీల్లో వచ్చే ఆదివారం(డిసెంబర్ 22) నుండి సెలవులు ప్రారంభంకానున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 24,25,26(మంగళ,బుధ,గురు) మూడ్రోజులు క్రిస్మస్ సెలవులు. మళ్ళి డిసెంబర్ 29 ఆదివారం సాధారణ సెలవులు. మొత్తంగా వచ్చేవారం ఐదురోజుల సెలవులు వస్తున్నాయి. అంటే స్కూళ్లు, కాలేజీలు నడిచేది డిసెంబర్ 23(సోమవారం), డిసెంబర్ 27,28(శుక్ర, శనివారం) మూడురోజులు మాత్రమే.
school holidays
ఆంధ్ర ప్రదేశ్ లో మరిన్ని సెలవులు వుంటాయా?
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతూ తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ దిశగా కదులుతోంది. ఇది ముందుకు సాగుతూ శనివారం నాటికి ఆంధ్ర ప్రదేశ్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం వుందని ఐఎండి ప్రకటించింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు (శుక్ర,శనివారం) ఏపీలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని... కాబట్టి ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.
ఇవాళ(డిసెంబర్ 20) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. ఇక కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూల్,నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించారు.
రేపు (డిసెంబర్ 21) శనివారం కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం వుందని హెచ్చరించారు.ఈ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు వచ్చే అవకాశం వుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం వున్న ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వొచ్చు.
ఇలా భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరిక నేపథ్యంలో ఈ రెండు రోజులు పలుప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు వచ్చే అవకాశం వుంది. జిల్లాలో పరిస్థితిని బట్టి కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులపై నిర్ణయం తీసుకోనున్నారు.
భారీ వర్షాల వల్ల సెలవులు వస్తే ఇవి వచ్చేవారం హాలిడేస్ తో కలిసిపోనున్నాయి. అంటే ఏపీలో వచ్చేవారం ఏపీలోని పలు ప్రాంతాల్లోని విద్యార్థులకు అదనపు సెలవులు వచ్చే అవకాశాలున్నాయి.