MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • సోనియాతో భేటీ: షర్మిలకు కాంగ్రెస్ రెండు ఆఫ్షన్లు?

సోనియాతో భేటీ: షర్మిలకు కాంగ్రెస్ రెండు ఆఫ్షన్లు?

వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ విషయమై  సోనియా,రాహుల్ లతో  వైఎస్ షర్మిల చర్చించారు.

narsimha lode | Published : Aug 31 2023, 03:10 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు  రెండు రకాల ఆఫ్షన్లు ఇచ్చినట్టుగా  ప్రచారం సాగుతుంది.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫ్షన్లపై  పార్టీ క్యాడర్ తో చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించాలని  వైఎస్ షర్మిల భావిస్తున్నట్టుగా  ప్రచారం సాగుతుంది. ఇవాళ సాయంత్రం  హైద్రాబాద్ లో వైఎస్ఆర్‌టీపీ  ముఖ్య నేతలతో వైఎస్ షర్మిల  భేటీ అయ్యే అవకాశం ఉంది.ఈ భేటీ తర్వాత ఈ విషయాలపై  మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

27
Asianet Image

కర్ణాటక రాష్ట్రం నుండి  వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తుంది.  జాతీయ స్థాయిలో  పార్టీలో ఆమెకు కీలక పదవిని కట్టబెట్టే అవకాశం ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో  షర్మిల సేవలను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  
 

37
Asianet Image

మరో వైపు  పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి తెలంగాణకే  షర్మిల పరిమితం కావడం  రెండో ఆఫ్షన్ గా చెబుతున్నారు. అయితే  ఈ రెండు ఆఫ్షన్ల ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైపు నుండి కానీ, వైఎస్ఆర్‌టీపీ నుండి అధికారికంగా  ప్రకటన రాలేదు.  

47
Telangana, Hyderabad, YS Sharmila, YSRTP, TRS, BRS, CM KCR,

Telangana, Hyderabad, YS Sharmila, YSRTP, TRS, BRS, CM KCR,

సోనియాగాంధీతో సమావేశం కావడం కోసం నిన్న సాయంత్రమే  వైఎస్ షర్మిల ఆమె భర్త అనిల్  న్యూఢిల్లీకి వచ్చారు.  ఇవాళ  ఉదయమే సోనియాగాంధీతో  బ్రేక్ ఫాస్ట్ భేటీలో  సోనియా, రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల పాల్గొన్నారు.ఈ భేటీ ముగిసిన తర్వాత ఆమె  న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ బయలుదేరారు

57
kc venugopal

kc venugopal


సోనియాతో భేటీలో పార్టీ విలీనంతో పాటు  కాంగ్రెస్ లో షర్మిలకు  ఏ రకమైన ప్రాధాన్యం దక్కనుందనే విషయమై  చర్చించారని సమాచారం. సోనియా, రాహుల్ గాంధీతో పాటు  కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్ కూడ  ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

67
ys sharmila

ys sharmila

తెలంగాణకే వైఎస్ షర్మిల పరిమితం కావడాన్ని  కాంగ్రెస్ లోని కొందరు తెలంగాణ నేతలు  వ్యతిరేకిస్తున్నారు.  ఈ పరిణామం రాజకీయంగా  కాంగ్రెస్ కు నష్టమని  కాంగ్రెస్ నేతలు కొందరు భావిస్తున్నారు. ఏపీలో  పార్టీ కోసం షర్మిల సేవలను వినియోగించుకోవాలని వారు సూచిస్తున్నారు. తెలంగాణకు చెందిన  నేతలు తమ అభిప్రాయాలను పార్టీ జాతీయ నాయకత్వానికే తేల్చి చెప్పారు. 

77
<p>ys sharmila</p>

<p>ys sharmila</p>

ఏపీ రాష్ట్రంలో వైఎస్ షర్మిల సేవలను  ఉపయోగించుకోవాలని   తెలంగాణ నేతలు  కొందరు  సూచిస్తున్నారు.కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల వస్తే  ఏపీలో  కాంగ్రెస్ ప్రయోజనమని  ఏపీకి చెందిన  కొందరు నేతలు భావిస్తున్నారు. ఏపీలో  చతికిలపడ్డ కాంగ్రెస్ కు  షర్మిల రాకతో  రాజకీయంగా పునరుత్తేజం  వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే  షర్మిల సేవలను  కాంగ్రెస్ పార్టీ  ఎలా ఉపయోగించుకుంటుందనేది  రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

narsimha lode
About the Author
narsimha lode
వై. ఎస్. షర్మిల
 
Recommended Stories
Top Stories