సమ్మెలో 57 వేల మంది: తాత్కాలిక ఉద్యోగుల నియామకం, ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు

First Published Oct 4, 2019, 3:56 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో  ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. తాత్కాలిక ఉద్యోగులను తీసుకొంటుంది. సమ్మెలో వెళ్లే ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించింది.

ఐఎఎస్ కమిటీతో చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది. ప్రైవేట్ బస్సులకు పర్మిట్లను ఇచ్చి ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నెల 8వ తేదీన దసరా పర్వదినం. తెలంగాణలో దసరా అతి పెద్ద పండుగ. ఈ పండుగను తమ స్వంత గ్రామంలో జరుపుకొనేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తమ గ్రామాలకు చేరుకొంటారు.

అయితే ఆర్టీసీ జేఎసీతో శుక్రవారంనాడు ఐఎఎస్ కమిటీ చర్చించింది.ఈ చర్చలు విఫలమయ్యాయి. ముందుగా ప్రకటించినట్టుగానే తాము సమ్మెలోకి వెళ్తున్నట్టుగా ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు. సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తామని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ హెచ్చరించారు.

ఆర్టీసీ జేఎసీ సమ్మెకు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,395 బస్సులు, 2వేల స్పెషల్ బస్సులు నిలిచిపోనున్నాయి. శుక్రవారం నాడు మధ్యాహ్నాం నుండి దూర ప్రాంతాలకు వెళ్లే  ఆర్టీసీ బస్సులను నిలిచిపోయాయి.

ఆర్టీసీ సమ్మెలో సుమారు 57 వేల మంది కార్మికులు పాల్గొననున్నారు. సమ్మెలో పాల్గొనే కార్మికులను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. తొలగించిన ఉద్యోగుల స్థానంలో తాత్కాలిక ఉద్యోగులను తీసుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుతం ప్రైవేట్ స్కూళ్లకు దసరా సెలవులు ఇచ్చారు. ఈ స్కూళ్ల బస్సులను కూడ ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.20 వేల ప్రైవేట్ స్కూల్ బస్సులను నడిపించనున్నారు. ఈ బస్సులే కాకుండా ప్రైవేట్ వాహనాలకు తాత్కాలిక పర్మిట్లు ఇచ్చి నడిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

బస్సులను నడిపేందుకు గాను తాత్కాలికంగా రెండు వేల మందిని విధుల్లోకి తీసుకొంటామని కూడ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. ఆర్టీసీ బస్సులను పోలీస్ భద్రతతో నడిపిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సుమారు 3 వేల మందిని తాత్కాలిక డ్రైవర్లను విధుల్లోకి తీసుకొంటామని ఆర్టీసీ ప్రకటించింది.

ఇప్పటికే ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగులుగా చేరేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయమై రాతపూర్వకంగా తమకు ఇవ్వాలని జేఎసీ నేతలు కోరుతున్న విషయాన్ని ఐఎఎస్ అధికారులు గుర్తు చేశారు. కనీసం ఆరు నుండి 7 వేల ప్రైవేట్ బస్సులను కూడ నడిపించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

దసరా పర్వదినం సందర్భంగా స్వంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రైవేట్ బస్సులను నడిపితే సమ్మెలో ఉన్న కార్మికులు ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా సకల జనుల సమ్మెలో తాము తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి సమ్మె నిర్వహించిన విషయాన్ని ఆర్టీసీ కార్మికులు గుర్తు చేస్తున్నారు. ఎస్మాతో పాటు డిస్మిస్ చేస్తామని బెదిరింపులకు తాము భయపడమని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?