ఇంటర్ చదివితే చాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. తెలంగాణ, ఏపీలోనే పోస్టింగ్
Railway Jobs 2025 : తెలుగు విద్యార్థులకు సూపర్ ఛాన్స్. సొంత రాష్ట్రంలోనే రైల్వే ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. ఈ ఆర్ఆర్బి జాబ్స్ నోటిఫికేషన్ కు సంబంధించిన ఫుల్ డిటెయిల్స్…

ఇండియన్ రైల్వే భారీ జాబ్స్ నోటిఫికేషన్
RRB NTPC Clerk Recruitment 2025 : రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఇది ఒక సువర్ణావకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) కింద మొత్తం 3,058 క్లర్క్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. మీరు ఇంటర్మీడియట్ పాసై ఉండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఇది గొప్ప అవకాశం. ఈ ఉద్యోగాలకు అవసరమైన ఇతర అర్హతలు, పోస్టుల వారీగా ఖాళీలు సహా ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి.
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ క్లర్క్ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్‌లో అత్యధికంగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 3058 పోస్టుల్లో 2,424 ఇవే ఉన్నాయి. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 394 పోస్టులు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 163 పోస్టులు, ట్రైన్ క్లర్క్- 77 పోస్టులు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగాలు
దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్) లో మొత్తం 272 పోస్టులు ఉన్నాయి. వీటిలో రిజర్వేషన్ల వారిగా ఖాళీలను పరిశీలిస్తే...
- అన్ రిజర్వుడ్ - 115
- ఎస్సి - 40
- ఎస్టి - 25
- ఓబిసి - 68
- ఈడబ్ల్యుఎస్ - 24
ఖాళీలను భర్తీచేయనున్నారు.
RRB NTPC ఉద్యోగాలకు అర్హతలు
ఈ పోస్టులకు అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) పాసై ఉండాలి. అలాగే అకౌంట్ క్లర్క్, జూనియర్ క్లర్క్, ట్రైన్ క్లర్క్ వంటి పోస్టులకు టైపింగ్ నైపుణ్యాలు కూడా అవసరం. ఇందులో- ఇంగ్లీషులో నిమిషానికి 30 పదాలు లేదా హిందీలో నిమిషానికి 25 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.
వయోపరిమితి :
18 నుండి 30 ఏళ్లలోపు వయసువారు అర్హులు. రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
RRB NTPC క్లర్క్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఈ రిక్రూట్‌మెంట్ మూడు దశల్లో ఉంటుంది
మొదటి దశ: CBT-1 పరీక్ష
మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1) 90 నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 40 ప్రశ్నలు జనరల్ అవేర్‌నెస్, 30 ప్రశ్నలు గణితం, 30 ప్రశ్నలు రీజనింగ్ నుంచి ఉంటాయి. ఇందులో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని గమనించాలి.
రెండో దశ: CBT-2 పరీక్ష
CBT-1 మెరిట్ ఆధారంగా మొత్తం పోస్టుల సంఖ్యకు 15 రెట్ల మంది అభ్యర్థులను CBT-2కు ఎంపికచేస్తారు. ఈ పరీక్ష కూడా 90 నిమిషాల పాటు ఉంటుంది, ఇందులో 120 ప్రశ్నలు ఉంటాయి. 50 ప్రశ్నలు జనరల్ అవేర్‌నెస్, 35 ప్రశ్నలు గణితం, 35 ప్రశ్నలు రీజనింగ్ నుంచి ఉంటాయి.
టైపింగ్ స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే)
అకౌంట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ పోస్టులకు అభ్యర్థులు టైపింగ్ స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, అంటే దీని మార్కులను ఫైనల్ మెరిట్‌లో కలపరు, కానీ ఇందులో పాసవడం తప్పనిసరి.
మూడో దశ :
సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్
రైల్వే క్లర్క్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు 27 నవంబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని ముఖ్యమైన వివరాలు, దరఖాస్తు లింక్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 12వ తరగతి పాసై, ప్రభుత్వ రంగంలో స్థిరమైన కెరీర్ కోరుకునే యువతకు రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
దరఖాస్తు పీజు :
జనరల్, ఓబిసి అభ్యర్థులకు రూ.500
ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి, ఎక్స్ సర్వీస్ మెన్స్, ట్రాన్స్ జెండర్, మైనారిటీస్, ఈబిసి అభ్యర్థులకు రూ.250 దరఖాస్తు ఫీజు ఉంటుంది. మొదటి దశ సిబిటి పరీక్షకు హాజరైతే ఈ మొత్తం తిరిగి చెల్లిస్తారు.
సాలరీ
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ - నెలకు రూ.21,700 (లెవెల్-3)
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - నెలకు రూ.19,900 (లెవెల్ 2)
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- నెలకు రూ.19,900 (లెవెల్ 2)
ట్రైన్ క్లర్క్- నెలకే రూ.19,900 (లెవెల్ 2)
సాలరీతో పాటు డిఎ, టిఎ, హెచ్ఆర్ఏ, పెన్షన్ స్కీమ్, మెడికల్ బెనిఫిట్స్ వంటి ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.