Real Estate: హైదరాబాద్‌లో అందరి దృష్టి ఆ ప్రాంతంపైనే.. తక్కువ ధరలో ఫ్లాట్స్
Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజుకీ మారుతూ ఉంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాచుర్యం ఉన్న ప్రాంతాలకంటే కొంత తక్కువ చర్చలో ఉండే ప్రాంతాలపై మొగ్గు చూపుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో ఒకదాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

మియాపూర్‌లో పెరుగుతోన్న అమ్మకాలు
మియాపూర్ ప్రధాన ఐటీ హబ్‌లకు, అవుటర్ రింగ్ రోడ్‌తో పాటు అంటు ముంబై హైవే, మరోవైపు ఆదిలాబాద్‌కు హైవేకు దగ్గరల్లో ఉంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల నుంచి మంచి కనెక్టివిటీ ఉంది. అలాగే ఈ ప్రాంతంలో అద్దెలు తక్కువ ఉండడం, ఫ్లాట్‌ల ధరలు కూడా తక్కువ ఉండడంతో ఐటీ ప్రొఫెషనల్స్ ఇక్కడే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా మియాపూర్ మెట్రో ద్వారా నగరంలోని ఏ ప్రాంతానికైనా త్వరగా వెళ్లేందుకు అవకాశం ఉంది.
సరసమైన హౌసింగ్ ఆప్షన్స్
ఇతర IT ప్రాంతాలతో పోలిస్తే మియాపూర్‌లో 2 BHK, 3 BHK గేటెడ్ కమ్యూనిటీల్లో సరసమైన ఇండ్లను పొందవచ్చు. కొత్తగా నిర్మించిన ఫ్లాట్స్‌లో సుమారు రూ. 45 నుంచి రూ. 80 లక్షల పరిధితో ఫ్లాట్స్ లభిస్తున్నాయి. ఇక సెకండ్ హ్యాండ్ విషయానికొస్తే మరింత తక్కువ ధరకే పొందొచ్చు.
అభివృద్ధి చెందుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఈ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్, స్కూల్స్, హాస్పిటల్స్, రిక్రియేషనల్ సౌకర్యాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త గేటెడ్ కమ్యూనిటీలలో జిమ్, పార్క్‌లు, క్లబ్‌హౌస్ వంటి ఆధునిక సౌకర్యాలు అందిస్తున్నాయి. అందువల్ల నివాసితులు అవసరమైన సౌకర్యాల కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతమైన జీవనం పొందొచ్చు.
ప్రకృతి అనుకూల, శాంతియుత వాతావరణం
హైదరాబాద్‌లోని బిజీ ప్రాంతాల కంటే మియాపూర్ తక్కువ జనసాంద్రత, ఎక్కువ చెట్లతో కూడుకుంది. కుటుంబాలకు, శాంతియుత, ఆరోగ్యకరమైన వాతావరణం కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
పెట్టుబడి అవకాశాలు
ORR విస్తరణలు, మెట్రో ఎక్స్‌టెన్షన్స్, కొత్త IT హబ్‌లు వంటి అభివృద్ధి ప్రాజెక్ట్స్ కారణంగా మియాపూర్‌లోని ప్రాపర్టీ విలువలు వచ్చే కొన్ని సంవత్సరాల్లో పెరుగుతాయని అంచనా. ఇక్కడ నివాసం ఉంటే, స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ సెంటర్లు, ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌ల దగ్గర ఉండటం వల్ల లైఫ్‌స్టైల్ సౌకర్యాలు కూడా అందుతాయి. పెద్ద IT ప్రాంతాల కంటే ఎక్కువ స్థలాలు, తక్కువ ధరలలో ఇల్లు పొందవచ్చు. దీంతో భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టే వారికి కూడా మియాపూర్ మంచి అవకాశంగా చెబుతున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టే ముందు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న నిపుణులను సంప్రదించి, వారి సలహాలు తీసుకోవడం మంచిది.