MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Rain Alert: ఇక షురూ.. తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు తప్పవు

Rain Alert: ఇక షురూ.. తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు తప్పవు

Rain Alert: తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 22వ తేదీ నుంచి పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 21 2026, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
Image Credit : Gemini AI

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..

తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' ప్రకటించింది. జూన్ 22 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జూన్ 23వ తేదీ నుంచి..
Image Credit : Getty

జూన్ 23వ తేదీ నుంచి..

భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, నైరుతి రుతుపవనాలు జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ, వాటి కదలిక కొంత మందగించింది. ఇప్పుడు జూన్ 23వ తేదీ నుంచి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ ఊపందుకోనున్నాయి. ఈ వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇప్పటికే కురుస్తుండగా, రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరగనుంది.

Related Articles

Related image1
School Bandh: విద్యార్థులకు ఊహించని సెలవు.. జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్
Related image2
భార‌త్‌లో ప‌గ‌టిపూట కూడా బైక్ లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి.? ఈ నిబంధ‌న ఎందుకో తెలుసా.?
35
ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్?
Image Credit : Getty

ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్?

హైదరాబాద్‌తో పాటు, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 22వ తేదీన ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ 23 నుంచి 24 వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే సూచనలున్నాయి. 

జూన్ 24 నుంచి జూన్ 25వ తేదీ మధ్య వర్షాల ప్రభావం మరింత విస్తరించి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

45
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Gemini AI

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే లైవ్ అప్‌డేట్‌లను గమనించాలని, ప్రయాణాల్లో జాప్యం జరగకుండా ముందే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. జీహెచ్‌ఎంసీ బృందాలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఆకస్మిక వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండటం క్షేమకరం అని అధికారులు తెలిపారు.

55
తగ్గనున్న ఉష్ణోగ్రతలు
Image Credit : Gemini AI

తగ్గనున్న ఉష్ణోగ్రతలు

ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని, వర్షాల సమయంలో అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాబోయే నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వాతావరణం
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
School Bandh: విద్యార్థులకు ఊహించని సెలవు.. జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
Recommended image3
Yoga Day: ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రిలో ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్స‌వం
Related Stories
Recommended image1
School Bandh: విద్యార్థులకు ఊహించని సెలవు.. జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్
Recommended image2
భార‌త్‌లో ప‌గ‌టిపూట కూడా బైక్ లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి.? ఈ నిబంధ‌న ఎందుకో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved