టీపీసీసీ చీఫ్ మార్పుపై మరోసారి చర్చ: కొత్త సారధి వచ్చేనా?
First Published Dec 3, 2020, 2:50 PM IST
టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త సారధి ఎంపికపై మరోసారి చర్చ సాగుతోంది. వరుస ఓటముల నేపథ్యంలో నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ చేసే నేతలు పెరిగిపోయారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ చీఫ్ ను మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.టీపీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గత కొంత కాలం క్రితం ఎఐసీసీకి లేఖ రాశాడు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తర్వాత పీసీసీ చీఫ్ ను మార్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడం ఆ పార్టీ క్యాడర్ ను తీవ్ర నిరాశలో ముంచెత్తింది.ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అంతేకాదు కనీసం డిపాజిట్ కూడా ఆ పార్టీకి దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ నేతలు పలు కారణాలను చెబుతున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?