హుజూర్‌నగర్‌‌లో సీనియర్ల మకాం: రేవంత్ ఢిల్లీ టూర్ వెనుక మతలబేంటీ..?

First Published 29, Sep 2019, 3:02 PM

పరిస్ధితి ఇంత కాకపై ఉన్న తరుణంలో టీ కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లడం టీకప్పులో కలకలం రేపింది. 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పక్షాల చూపంతా ప్రస్తుతం హుజూర్‌నగర్‌పైనే ఉంది. ఉత్తమ్ ‌కుమార్ రెడ్డి కంచుకోటలను బద్ధలు కొట్టాలని టీఆర్ఎస్.. తన కుటుంబానికి పెట్టనికోటగా ఉన్ని హుజూర్‌నగర్‌ను మరొకరి చేతుల్లోకి వెళ్లకూడదనే పట్టుదలతో ఉత్తమ్ వ్యూహాలు రచిస్తున్నారు.

పరిస్ధితి ఇంత కాకపై ఉన్న తరుణంలో టీ కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లడం టీకప్పులో కలకలం రేపింది. హుజూర్‌నగర్ అభ్యర్ధిగా రేవంత్ ఓ వ్యక్తి ని ప్రతిపాదించడం దానికి సీనియర్ల నుంచి అభ్యంతరాలు రావడం పద్మావతికి అభ్యర్ధిత్వం ఖరరావ్వడం చకచకా జరిగిపోయాయి.

ఈపాటికి టీపీసీసీ చీఫ్ పీఠంపై కూర్చోవాల్సిన తనకు.. అది దక్కకుండా పెద్దలు కుట్రపన్నారని రేవంత్ లోలోపల కుమిలిపోతున్నారు. ఇప్పుడు తాజాగా హుజూర్‌నగర్ విషయంలో తన మాట చెల్లకపోవడంతో టీపీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని రేవంత్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే సరిగ్గా సీనియర్లంతా హుజుర్‌నగర్‌పై ఫోకస్ పెట్టిన టైం చూసుకుని రేవంత్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. తనకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని ఏ రకంగా సమర్థంగా నడపగలను అనే అంశాన్ని వివరించడంతో పాటు తనపై జరుగుతున్న కుట్రలను రేవంత్ హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చే అవకాశాలున్నాయంటున్నారు పరిశీలకులు.

రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు దక్కితే ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు. కొడంగల్‌లో ఓటమి, కాంగ్రెస్‌లో కుదురుకోవడానికి కాస్త గ్యాప్ తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి సీఎం విషయాన్ని పక్కనబెట్టినట్లుగా తెలుస్తోంది. అదను కోసం చూస్తున్న ఆయనకి కీలక పదవి దక్కితే చంద్రశేఖర్ రావును ఏకీపారేయడానికి అన్ని రకాల అస్త్రాలు సిద్ధంగానే ఉంచుకున్నారని టాక్.

ఒకవేళ అధిష్టానం నుంచి రేవంత్‌కు సానుకూల స్పందన లభించి పీసీసీ చీఫ్ పోస్ట్ ఓకే అయితే మాత్రం సీనియర్లను తనదైన స్టైల్లో దారిలో పెట్టాల్సి వుంటుంది. అయితే దశాబ్ధాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిపై కొత్తగా వచ్చిన వ్యక్తి అజమాయిషీ చేస్తానంటే పెద్దలు ఒప్పుకుంటారా...? చూస్తూ చూస్తు తమ జుట్టు రేవంత్‌ చేతుల్లో పెట్టనిస్తారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉపఎన్నికల్లో ఎంత బిజీగా ఉన్నా రేవంత్‌‌పై ఒక కన్నేసి ఉంచారని విశ్లేషకులు చెబుతున్నారు.

loader