- Home
- Telangana
- Kumbh Mela Prasadam Online Order : కుంభమేళాకు వెళ్ళలేకపోతున్నారా? మీ ఇంటివద్దకే త్రివేణి సంగమజలం, ప్రసాదం
Kumbh Mela Prasadam Online Order : కుంభమేళాకు వెళ్ళలేకపోతున్నారా? మీ ఇంటివద్దకే త్రివేణి సంగమజలం, ప్రసాదం
Maha Kumbh Mela 2025 : మీరు ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్లలేక బాధపడుతున్నారా? అయితే మీ ఇంటివద్దకే కుంభమేళా ప్రసాదం, త్రివేణి సంగమ పవిత్ర జలాన్ని అందించే ఏర్పాటు చేసింది ఏసియా నెట్ డిజిటల్. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే...

Prayagraj Kumbh Mela 2025
Prayagraj Kumbh Mela 2025 : ప్రస్తుతం యావత్ భారతీయుల అడుగులు ప్రయాగరాజ్ వైపే సాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కార్యక్రమం మహా కుంభమేళా ప్రయాగరాజ్ లో అట్టహాసంగా సాగుతోంది. 144 ఏళ్లతర్వాత జరుగుతున్న కుంభమేళాలో పాల్గొనాలని... పవిత్ర త్రివేణం సంగమంలో అమృతస్నానం చేయాలని మెజారిటీ హిందువులు కోరుకుంటున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కు పయనం అవుతున్నారు.
దేశ విదేశాల నుండి కుంభమేళాకు భక్తులు, పర్యాటకులు హాజరవుతున్నారు. ఇప్పటికే కుంభమేళా ప్రారంభమై నెలరోజులు కావస్తోంది. ఇంకో 20 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే దాదాపు 38 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాను సందర్శించి పుణ్యస్నానం చేసారు. మొత్తంగా కుంభమేళా ముగిసేనాటికి 45 నుండి 50 కోట్లమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలామంది కుంభమేళాకు వెళుతున్నారు. రైళ్లు, బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలు, విమానాల్లో ఎలా కుదిరితే అలా ప్రయాగరాజ్ వెళుతున్నారు. కుటుంబసభ్యులతో కొందరు, స్నేహితులతో ఇంకొందరు వెళుతున్నారు... గ్రామాలు, కాలసీవాసులు, చుట్టుపక్కల ఇళ్లవారు ఇలా దేశంలోని సగం జనాభా ప్రయాగరాజ్ కుంభమేళాలో పాల్గొంటోంది.
ఇప్పుడున్న తరం జీవితంలో ఒక్కసారే ఇలాంటి మహత్కార్యంలో పాల్గొనేది. కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు,వ్యవసాయ పనులు...ఇలా వివిధ కారణాలతో కొందరు కుంభమేళాకు వెళ్లలేకపోతున్నారు. ఇలాంటివారికి ఏసియా నెట్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. మీ ఇంటివద్దే వుండి ప్రయాగరాజ్ కుంభమేళా ప్రసాదం, త్రివేణి సంగమ పవిత్ర నీటిని పొందే ఏర్పాటుచేసింది. మీరు కూడా వీటిని పొందవచ్చు.. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.
Prayagraj Kumbh Mela 2025
మీ ఇంటికే కుంభమేళా ప్రసాదం, గంగాజలం :
ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్లలేకపోతున్నవారు ఆ పుణ్యఫలాన్ని ఇంట్లో వుండి పొందవచ్చు. కుంభమేళాలో దొరికే ప్రసాదంతో పాటు గంగా, యమునా, సరస్వతి నదుల సంగమప్రాంతంలో ప్రవహించే పవిత్రమైన నీటిని ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఏసియానెట్ న్యూస్ డిజిటల్ భాగస్వామ్యంతో ONDC (Open Network for Digital Commerce) ఇప్పటికే వీటిని అందిస్తోంది.
మీరు కూడా కుంభమేళా ప్రసాదం, సంగమ జలం కావాలనుకుంటే వెంటనే ఏసియానెట్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి. అక్కడ లైవ్ బ్యానర్ ద్వారా ONDC నెట్ వర్క్ ను నేరుగా యాక్సెస్ చేయండి. లేదంటే ఈ .telugu.asianetNews.com పై క్లిక్ చేయండి. ఇందులో కుంభమేళా ప్రసాదాన్ని లేదంటే ప్రసాదంలో పాటు త్రివేణి సంగమ జలాన్ని ఆర్డర్ చేయవచ్చు.
ఇలా ఆర్డర్ చేసిన ప్రాంతాన్నిబట్టి డెలివరీ సమయం నిర్ణయించబడుతుంది. హైదరాబాద్ వంటి నగరాలకు మూడు నాలుగు రోజుల్లోనే కుంభమేళా ప్రసాదం, సంగమ జలం చేరుతుంది. మారుమూల ప్రాంతాలు, గ్రామాలకు కాస్త ఆలస్యం కావచ్చు. ఏదేమైనా కుంభమేళాకు వెళ్లలేమని బాధపడేవారికి ఊరటనిచ్చేలా ఏసియానెట్ చర్యలు తీసుకుంది.
Prayagraj Kumbh Mela 2025
ప్రయాగరాజ్ కుంభమేళాపై ఏసియానెట్ స్పెషల్ కవరేజ్ :
144 ఏళ్లతర్వాత జరుగుతున్న ప్రయాగరాజ్ మహాకుంభమేళా వైభవంగా సాగుతోంది. ఆ టెంట్ సిటీ, త్రివేణి సంగమం, గంగా ప్రవాహం వెంట కోట్లాది భక్తుల సందడి, అఖాడాల్లో సాధుసంతులు, నాగసాధువులు, సన్యాసులు... ఆ కుంభమేళా వైభవం చూసేందుకు రెండుకళ్లు చాలవు. అయితే ఇదంతా చూడటం ఎవరివల్ల కాదు... అందువల్లే ఏసియానెట్ కెమెరా కంటితో చూపిస్తున్నాం.
కుంభమేళాకు దాదాపు రెండుమూడు నెలల ముందునుండే ఏసియానెట్ డిజిటల్ ఏర్పాట్లగురించి ప్రజలకు తెలియజేసింది. ఇక గత నెలరోజులుగా కుంభమేళా ఎలా జరుగుతోంది తెలియజేస్తున్నాం... ఆర్టికల్స్, ఫోటోలు, వీడియోల ద్వారా కుంభమేళాకు స్పెషల్ కవరేజ్ ఇస్తున్నాం. ఇలా వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు మొత్తం 8 బాషల్లో మహాకుంభమేళా విశేషాలు అందిస్తున్నాం... తద్వారా వారికి సంగమతీరంలోనే వున్నామా అన్న అనుభూతిని కలిగిస్తోంది.
ఏసియా నెట్ తెలుగు కూడా ప్రయాగరాజ్ కుంభమేళాను స్పెషల్ గా కవర్ చేసింది. కాబట్టి కుంభమేళా వార్తలను ఇక్కడ చదవవచ్చు... వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ చూడవచ్చు.
మరిన్ని చదవండి :
కుంభమేళాకు వెళ్లేవారికి అదానీ సూపర్ గిప్ట్ ... ఈ ఫ్రీ గిప్ట్స్ మీరూ పొందవచ్చు.
కుంభమేళాకు వెళ్లలేకపోతున్నారా? అయితే ఇంట్లోనే సంగమ స్నానం పుణ్యాన్ని పొందండిలా...