కుంభమేళాకు వెళ్లేవారికి అదానీ సూపర్ గిప్ట్ ... ఈ ఫ్రీ గిప్ట్స్ మీరూ పొందవచ్చు.
ప్రయాగరాజ్ కుంభమేళాలో అనేక సంస్థలు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అయితే భారతీయ కుభేరుడు గౌతమ్ అదానీ మాత్రం భక్తులకు ఫ్రీగా చక్కటి గిప్ట్ అందిస్తున్నారు. అదేంటో తెలుసా?

Gautham Adani
Kumbhmela 2025 : ఉత్తర ప్రదేశ్ కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన గౌతమ్ అదానీ కుంభమేళాకు వచ్చే భక్తులకు పుస్తకాల పంపిణీ చేపట్టారు. గీతా ప్రెస్ సంస్థతో కలిసి అదానీ గ్రూప్ కుంభమేళాలో భక్తులకు ఉచితంగానే కోటి భక్తి గీతాల పుస్తకాలను అందిస్తున్నారు.
యూపీలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో గీతా ప్రెస్ ను 1923 లో ఏర్పాటుచేసారు. మార్వాడీ వ్యాపారి జయదయాళ్ గోయంద్కా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన గీతోపదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు దీన్ని ప్రారంభించారు. ఇలా ప్రారంభమైన గీతా ప్రెస్ ప్రస్తుతం దేశంలోనే ఆధ్యాత్మిక ప్రచురణకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అతి తక్కువ ధరకే మన సంస్కృతి సంప్రదాలయను ప్రచారం చేసే పుస్తకాలను ఇక్కడ ప్రచురిస్తారు.
అయితే ప్రస్తుతం కుంభమేళా సందర్భంగా యూపీకి వచ్చే భక్తులకు తమవంతుగా ఏదయినా కానుక ఇవ్వాలని గీతా ప్రెస్ నిర్వహకులు భావించారు. అనుకున్నదే తడవుడా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని సంప్రదించింది. ఇలా అదానీ గ్రూప్ సహకారంతో గీతాప్రెస్ కుంభమేళాకు వచ్చే భక్తులకు కోటి భక్తి గీతాల పుస్తకాన్ని ఉచితంగా అందిస్తోంది.స్వయంగా గౌతమ్ అదానీ ఈ పుస్తకాన్నిపరిశీలించి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Kumbhmela 2025
కుంభమేళాలో అదానీ అన్నదానం :
ప్రయాగరాజ్ కుంభమేళాకు కోట్లాదిమంది భక్తులు హాజరవుతున్నారు... పవిత్ర త్రివేణి సంగమం (గంగా, యమునా, సరస్వతి నదులు) లో స్నానం ఆచరిస్తున్నారు. ఇలా పిల్లాపాపలతో కలిసి ప్రయాగరాజ్ కు విచ్చేసిన భక్తులు ఆకలితో బాధపడకుండా వుండేలా అదానీ గ్రూప్ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతోంది.
ప్రముఖ ఆద్యాత్మిక సేవా సంస్థ ఇస్కాన్ తో కలిసి అదానీ గ్రూప్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇలా కుంభమేళాకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఆకలి తీరుస్తున్నారు. ఇలా ఒక్కరోజు కాదు... కుంభమేళా ముగిసే అన్నదానం కొనసాగనుంది. ఈ అన్నదానం కోసం మొత్తం 40 కేంద్రాలను ఏర్పాటుచేసారు.
అన్నదానం కోసం అదానీ గ్రూప్ పూర్తి సహకారం అందిస్తోందని ఇస్కాన్ డైరెక్టర్ మధుకాంత్ దాస్ తెలిపారు. ఆహారం సరఫరా చేసేందుకు అదానీ గ్రూప్ వంద వాహనాలను సమకూర్చిందని తెలిపారు. అలాగే ఈ పుణ్యకార్యంలో తమకు సహాయం చేసేందుకు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
adani pic
కుంభమేళాలో కుటుంబసమేతంగా పాల్గొన్న అదానీ :
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ ప్రయాగరాజ్ కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబసమేతంగా కుంభమేళాకు వచ్చిన ఆయన గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత హనుమాన్ దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఇస్కాన్ తో కలిసి అదానీ గ్రూప్ కుంభమేళాకు వచ్చే భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వంటశాలలో స్వయంగా గరిటెతిప్పిన ఆయన భక్తులకు అహారం వడ్డించారు. ఇలా కుంభమేళాలో పాల్గొని ఆద్యాత్మికతను, అన్నదానం చేపడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు గౌతమ్ అదానీ.