MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్

Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్

ఒకటి రెండ్రోజులు కాదు ఈ వారంలో తెలుగోళ్లకు ఐదురోజులు సెలవులు వస్తున్నాయి. ఏ  రోజుల్లో స్కూల్, ఆఫీసులు పనిచేస్తాయి? ఏఏ రోజుల్లో సెలవులున్నాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 22 2026, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ వీక్ సెలవులే సెలవులు
Image Credit : Gemini AI

ఈ వీక్ సెలవులే సెలవులు

Holidays : వేసవి సెలవులు ముగిసి వారంరోజులు కూడా కాలేదు... అప్పుడే మళ్లీ వరుస సెలవులు వస్తున్నాయి. ఈ వారంలో ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా నాలుగైదు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు మూతపడనున్నాయి. వేసవి సెలవులు ముగిశాయని బాధపడుతూ భారంగా బడిబాట పట్టిన విద్యార్థులకు ఈ సెలవులు కాస్త ఊరట ఇవ్వనున్నాయి. అయితే కేవలం విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ వారంలో ఏరోజు వర్కింగ్ డే? ఎన్నిరోజులు సెలవులు వస్తున్నాయి? ఈ సెలవులు ఎందుకో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జూన్ 21 నుండి 28 వరకు సెలవులే..
Image Credit : Gemini AI

జూన్ 21 నుండి 28 వరకు సెలవులే..

నిన్న (జూన్ 21) ఆదివారం కాబట్టి విద్యార్థులు, ఉద్యోగులకు సాధారణ సెలవే. ఇవాళ (జూన్ 22) సోమవారం వర్కింగ్ డే.. అంటే స్కూళ్లు, ఆఫీసులు యధావిధిగా పనిచేస్తాయి. ఈ మంగళవారం (జూన్ 23న) తెలంగాణ విద్యార్థులకు సడన్ గా సెలవు వచ్చే అవకాశాలున్నాయి.

ఇక ఈ బుధవారం (జూన్ 24న) స్కూళ్లు, ఆఫీసులు పనిచేస్తాయి... ఆ తర్వాతే అసలు సెలవులు షురూ అయ్యేది. జూన్ 25 నుండి 28 వరకు వరుస సెలవులు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో రెండ్రోజులే వర్కింగ్ డేస్... మిగతా ఆరురోజులు సెలవులే... ఇందులో రెండు ఆదివారాలు పోగా నాలుగు రోజుల సెలవులు ఎక్స్ట్రాగా వస్తున్నాయి.

35
జూన్ 23న తెలంగాణ స్కూల్స్ బంద్..
Image Credit : getty

జూన్ 23న తెలంగాణ స్కూల్స్ బంద్..

తెలంగాణ విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం బిజెపి విద్యార్థి విభాగం ABVP (అఖిల భారత విద్యార్థి పరిషత్) పోరాటానికి సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే రేవంత్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. జూన్ 23న అంటే ఈ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ మూసివేయాలని ఏబివిపి పిలుపునిచ్చింది. ఈ స్టూడెంట్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టనున్నారు... కాబట్టి స్కూళ్ళు నడిపించే ప్రయత్నం చేసినా బలవంతంగా మూయించే అవకాశాలుంటాయి.

45
జూన్ 25, 26 మొహర్రం సెలవులు
Image Credit : Getty

జూన్ 25, 26 మొహర్రం సెలవులు

మొహర్రం పండగను తెలుగు రాష్ట్రాల్లోని హిందూముస్లింలు కలిసి ఘనంగా జరుపుకుంటారు... అందుకే ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు రెండ్రోజులు సెలవు ప్రకటించాయి. మొహర్రం పండక్కి ముందురోజు అంటే జూన్ 25 గురువారం తెలుగు ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ఉంది.. కాబట్టి ముందస్తు అనుమతి తీసుకుని వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఈ సెలవు పొందవచ్చు.. కానీ విద్యాసంస్థలు యధావిధిగా నడుస్తాయి, విద్యార్థులకు సెలవు ఉండదు. 

ఇక జూన్ 26, శుక్రవారం మొహర్రం పండగ... కాబట్టి ఆరోజు పూర్తిస్థాయి హాలిడే ఉంటుంది. అంటే ఉద్యోగులకే కాదు విద్యార్థులకు సెలవే... స్కూళ్లు, ఆఫీసులు పూర్తిగా మూసివుంటాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ శుక్రవారమే మొహర్రం వేడుకలు జరుగుతాయి.

55
జూన్ 27, 28 వీకెండ్ హాలిడేస్
Image Credit : ChatGPT

జూన్ 27, 28 వీకెండ్ హాలిడేస్

కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు... ఐటీ, కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసేవారికి వీకెండ్ రెండ్రోజులు సెలవు ఉంటుంది. అలాగే కొన్ని విద్యాసంస్థలు కూడా రెండ్రోజులు సెలవులు ఇస్తాయి. అంటే కొందరు ఉద్యోగులు, విద్యార్థులకు జూన్ 27న శనివారం సెలవే. అయితే చాలా విద్యాసంస్థలు, ఆఫీసులు శనివారం పనిచేస్తాయి... ఈ సెలవు కొందరికే వర్తిస్తుంది.

బ్యాంకు ఉద్యోగులకు మాత్రం ఈ శనివారం కచ్చితంగా సెలవు ఉంటుంది. ప్రతి నెలలో రెండు, నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది... ఈ జూన్ లో రాబోయేది నాలుగో శనివారం. కాబట్టి తెలంగాణ, ఏపీలోని బ్యాంక్ ఉద్యోగులకు సెలవు ఉంటుంది.

జూన్ 28 ఆదివారమే కాబట్టి విద్యార్థులు, ఉద్యోగులకు సాధారణ సెలవు ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో కేవలం రెండ్రోజులే (జూన్ 22, 24) ఫుల్ వర్కింగ్ డేస్... ఐదు రోజులు (జూన్ 23, 25, 26, 27, 28) సెలవులే. ఈ హాలిడేస్ న్యూస్ విద్యార్థులే కాదు ఉద్యోగులు ఎగిరిగంతేసేదే.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ration Card: రేషన్ కార్డు కట్ కావొద్దంటే ఇలా చేయండి.. అంతా ఇంటి నుంచే !
Recommended image2
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image3
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Related Stories
Recommended image1
Bank Holidays : వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు సెలవు అంటే?
Recommended image2
School Holidays 2026-27 : ఈ అకడమిక్ ఇయర్ లో 87 రోజులు సెలవులే.. తెలుగు స్టూడెంట్స్ కి ఏ నెలలో ఎన్ని సెలవులు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved