MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Telangana
  • నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

రెండు అసెంబ్లీ స్థానాల్లో తనతో పాటు  తన కొడుకు పోటీ చేసేందుకు మైనంపల్లి హన్మంతరావు   రంగం సిద్దం  చేసుకుంటున్నారు.

2 Min read
Author : narsimha lode
Published : Aug 22 2023, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

మెదక్, మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాల్లో తనతో పాటు తన కొడుకు రోహిత్ పోటీ కోసం మైనంపల్లి హన్మంతరావు కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నారు.  నిన్న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో  మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావుకు  బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కింది.  అయితే మెదక్ నుండి  తన కొడుకు రోహిత్ కు  టిక్కెట్టు  కోసం  మైనంపల్లి హన్మంతరావు  ప్రయత్నించారు. కానీ  రోహిత్ కు టిక్కెట్టు దక్కలేదు. దీంతో  మైనంపల్లి హన్మంతరావు  మంత్రి హరీష్ రావుపై సీరియస్ వ్యాఖ్యలు  చేశారు.ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

2014 ఎన్నికల సమయంలో  టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 2009లో మెదక్ నుండి  మైనంపల్లి హన్మంతరావు  టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు. అయితే  2014 నుండి మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి పోటీకి  మైనంపల్లి హన్మంతరావు  పోటీకి  రంగం సిద్దం  చేసుకున్నారు.   
 

38
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

2014లో ఎన్నికలు జరిగే సమయానికి  రాష్ట్ర విభజన జరగలేదు. కానీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరిగాయి.  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో  బీజేపీ, టీడీపీ మధ్య  పొత్తు  కుదిరింది. ఈ కూటమికి జనసేన మద్దతు ప్రకటించింది. తెలంగాణలో  పొత్తు విషయమై మల్కాజిగిరి సీటు విషయంలో పీటముడి నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కోసం బీజేపీ నేతలు మల్కాజిగిరి సీటు కోసం పట్టుబట్టారు.  ఈ సీటు ఇవ్వకపోతే పొత్తు వద్దని తేల్చి చెప్పారు.  అయితే  అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  మల్కాజిగిరి సీటును బీజేపీకి వదిలిపెట్టారు చంద్రబాబు

48
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

అయితే మల్కాజిగిరి అసెంబ్లీ సీటు కోసం  మైనంపల్లి హన్మంతరావు  చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగారు.  వేరే సీటు  ఇచ్చేందుకు  టీడీపీ ప్రయత్నించినా కూడ బీజేపీ నిరాకరించింది. మల్కాజిగిరిలో  బీజేపీ అభ్యర్థిగా  రామచంద్రరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే  టీడీపీలో టిక్కెట్టు దక్కకపోవడంతో కేటీఆర్  మైనంపల్లి హన్మంతరావుకు  ఫోన్ చేసి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. 2014లో  మైనంపల్లి హన్మంతరావు  బీఆర్ఎస్ లోచేరారు.  అయితే  మైనంపల్లి హన్మంతరావుకు  మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్టు ఇచ్చారు

58
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

  2014 లో మైనంపల్లి  హన్మంతరావు  టీడీపీ అభ్యర్థి  మల్లారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత బీఆర్ఎస్ గ్రేటర్ హైద్రాబాద్  అధ్యక్షుడిగా  మైనంపల్లి హన్మంతరావు  పనిచేశారు.  2018లో  మైనంపల్లి హన్మంతరావు  మల్కాజిగిరి నుండి  బీఆర్ఎస్ అభ్యర్థిగా  పోటీ చేసి  విజయం సాధించారు. నిన్న కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మైనంపల్లి హన్మంతరావుకు  చోటు దక్కింది.అయితే  మెదక్ నుండి తన కొడుకు రోహిత్ కోసం  హన్మంతరావు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ హన్మంతరావుకు నిరాశే ఎదురైంది.

68
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

టీడీపీలో ఉన్న సమయం నుండి హరీష్ రావుకు  మైనంపల్లి హన్మంతరావుకు పొసగదు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడ వీరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే  ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. మెదక్ లో  రోహిత్ కోసం  హన్మంతరావు  ప్రయత్నాలకు హరీష్ రావు చెక్ పెట్టాడనే అసంతృప్తి ఉంది. దీంతో  నిన్న తిరుపతిలో  హరీష్ రావుపై  మైనంపల్లి హన్మంతరావు  సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను  మంత్రి కేటీఆర్ కూడ  ఖండించారు.

78
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

మెదక్, మల్కాజిగిరిలలో  పోటీ చేయాలనే యోచనలో  హన్మంతరావు, ఆయన తనయుడు  రోహిత్ ఉన్నారు. ఈ రెండు టిక్కెట్లు ఇస్తే  కాంగ్రెస్ లో చేరాలని మైనంపల్లి హన్మంతరావు  భావిస్తున్నారనే ప్రచారం సాగుతుంది.  మైనంపల్లి హన్మంతరావు  తన అనుచరులతో  ఈ విషయమై చర్చించనున్నారు. మెదక్, మల్కాజిగిరిలలో ఉన్న తన అనుచరులతో సమావేశమై  ఈ విషయాలపై  చర్చించనున్నట్టుగా మైనంపల్లి హన్మంతరావు  ప్రకటించారు

88
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?

బీఆర్ఎస్ ను వీడేందుకు మైనంపల్లి హన్మంతరావు రంగం సిద్దం  చేసుకున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ రెండు స్థానాలకు  చెందిన  కార్యకర్తలతో సమావేశమైన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని మైనంపల్లి హన్మంతరావు తేల్చి చెప్పారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. ఈ రచ్చకు కారణమేంటి?
Recommended image3
Konda Surekha: నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అదిష్టానం ఇష్టం.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved