అమ్మలో సగం, నాన్నలో మరో సగమే నా అన్న : కేటీఆర్ ఫోటోతో కవిత ఎమోషనల్ ట్వీట్
రక్షా బంధన్ సందర్భంగా తన అన్న కేటీఆర్ తో వున్న అనుబంధాన్ని తెలియజేస్తూ కవిత ఎమోషన్ అయ్యారు.

ktr kavitha
హైదరాబాద్ : సోదర సోదరీమణుల ప్రేమానురాగాల పండగ రక్షా బంధన్. అన్నదమ్ముళ్లకు రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకుంటారు ఆడపడుచులు. ఇలా ప్రతిఏటా రాఖీ పండగ సందర్భంగా సందడిగా వుండే ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఈసారి బోసిపోయింది. సోదరుడు కేటీఆర్ కుటుంబసమేతంగా అమెరికా పర్యటనలో వుండటంతో కవిత రాఖీ కట్టలేకపోతోంది. దీంతో ఎక్స్(ట్విట్టర్) వేదికన కవిత ఎమోషనల్ ట్వీట్ చేసారు.
KTR Kavitha
తాను అన్నతో కలిసి దిగిన ఫోటోను జతచేస్తూ ''అమ్మ లోని మొదటి అక్షరం...నాన్నలోని చివరి అక్షరం నా అన్న'' అంటూ కవిత ట్వీట్ చేసారు. ఇలా తన సోదరుడిపై ప్రేమను ఎమోషనల్ ట్వీట్ ద్వారా వ్యక్తంచేసారు ఎమ్మెల్సీ కవిత.
Kavitha
ఇలా సొంత సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయినా మరో సోదరుడు సంతోష్ కు రాఖీ కట్టారు కవిత. ఇక సొంత సోదరి జోగినిపల్లి సౌమ్య కూడా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు రాఖీ కట్టారు. ఇలా తనకు రాఖీ కట్టిన సోదరీమణులతో నవ్వులు చిందిస్తూ దిగిన ఫోటోను జతచేస్తూ సంతోష్ కూడా ఎమోషనల్ ట్వీట్ చేసారు.
KTR
ప్రేమకు ప్రతిరూపమే కాదు తోబుట్టువులకు రక్షణ ఎప్పుడూ సోదరులు రక్షణగా వుండాలని గుర్తుచేసేదే ఈ రాఖీ అని సంతోష్ అన్నారు. తన ప్రియమైన చెల్లెల్లు కవిత, సౌమ్య రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన ప్రపంచాన్ని మరింత అందంగా మార్చి వెలుగు నింపిన చెల్లెమ్మలకు కృతజ్ఞతలు అంటూ సంతోష్ ట్వీట్ చేసారు.
Kavitha
కవిత కూడా సోదర సోదరీమణులు, కుటుంబంలోని చిన్నారులంతా రాఖీ పండగ సందర్భంగా కలిసిన ఫోటోను జతచేసి మరో ట్వీట్ చేసారు. ఇలాంటి గొప్ప సోదరులను కలిగివుండటం తన అదృష్టమని అన్నారు.