- Home
- Telangana
- భద్రాచలం ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన.. పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచన.. (ఫొటోలు)
భద్రాచలం ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన.. పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచన.. (ఫొటోలు)
వరదముంపు ప్రాంతాల్లో రవాణాశాఖ పువ్వాడ అజయ్ కుమార్ విస్తృత పర్యటన చేశారు. స్థానికులను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

puvvada ajay 8
వరద ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. శుక్రవారం తెల్లవారు ఝామునుండే విస్తృత పర్యటన ప్రారంభించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను స్వయంగా కలిసి తక్షణమే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు.
puvvada ajay 7
గోదావరి వరద ఉదృతి 68 అడుగులకు పెరిగింది. ఇంకా పెరిగి 75 అడుగుల వరకు వస్తుందన్న సమాచారం మేరకు.. ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలం పట్టణం AMC కాలనీ, సుభాష్ నగర్, శాంతి నగర్, మిథిలా స్టేడియంలో వరుద నీరు చేరడంతో ఆయా ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
puvvada ajay 6
మోకాళ్ల లోతులో నీళ్లలో మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా వెళ్ళి ప్రజలను తరలించారు. ముంపుకు గురైన వివిధ ప్రాంతాలలో ప్రజలను తక్షణమే తరలించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
puvvada ajay 5
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం ప్రాంతం పూర్తిగా నీట మునిగే పరిస్థితి వచ్చింది. ఆ ప్రాంతంలోని ప్రజలను తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
puvvada ajay 4
ఆయా కాలనీలను సందర్శించిన పువ్వాడ అజయ్ కుమార్.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలాలని సూచించారు. మోకాలు లోతు నీళ్లలో ఆయా కాలనీల్లో అజయ్ కుమార్ పర్యటించారు.
puvvada ajay 3
ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్న కారణంగా ప్రమాదం పొంచి ఉందని.. స్థానికుల భద్రతే తమకు ముఖ్యమని అజయ్ కుమార్ తెలిపారు.
puvvada ajay 1
భద్రాచలంలో అంతకంతకూ నీటి ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి 69 అడుగులు దాటింది.దీంతో అక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించడం తప్ప వేరే మార్గం లేదు.