జనగామలో దారుణం: భార్యతో వివాహేతర సంబంధం.. ఫోన్ కాల్‌తో లీక్, ఆమె భర్త ఏం చేశాడంటే..
వివాహేతర సంబంధాలు కొన్ని కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతడిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చేపల వలలో మూటకట్టి చెరువులో పడేశాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.
వివాహేతర సంబంధాలు కొన్ని కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతడిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చేపల వలలో మూటకట్టి చెరువులో పడేశాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.
వివరాలు.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన తీగల కరుణాకర్(36) అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కరుణాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివునిపల్లి గ్రామానికే చెందిన చిక్కుడు నాగరాజు హమాలీ పనిచేస్తున్నారు. నుమిలిగొండ శివారులో కరుణాకర్, నాగరాజులకు చెందిన వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నాగరాజు భార్యతో కరుణాకర్‌కు పరిచయం ఏర్పడింది.
illegal love age
ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఈ నెల 25న హైదరాబాద్‌లో ఉన్న కరుణాకర్.. నాగరాజు భార్యకు ఫోన్ చేశాడు. అయితే ఫోన్‌ను నాగరాజు లిఫ్ట్ చేశాడు.. అయితే ఇది గమనించని కరుణాకర్ నాగరాజు భార్యతో అతనికున్న బంధం గురించి మాట్లాడాడు. తాను సాయంత్రం వస్తున్నానని, కలుద్దామని కూడా చెప్పాడు.
అయితే అదే రోజు సాయంత్రం నాగరాజుకు భార్యకు మరోసారి ఫోన్ రావడం, ఆ తర్వాత ఆమె తోట వద్దకు వెళ్లడం నాగరాజు గమనించాడు. అక్కడ తన భార్య, కరుణాకర్ కలుసుకున్న విషయాన్ని నాగరాజు గుర్తించారు. ఈ క్రమంలోనే నాగరాజుపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత చేపల వలలో మూటకట్టి నమిలిగొండ గ్రామ చెరువులో పడేశాడు.
అయితే 25వ తేదీ సాయంత్రం నుంచి కరుణాకర్ కనిపించకుండా పోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. హైదరాబాద్‌తో పాటు, శివునిపల్లి గ్రామంలో కూడా ఆరా తీశారు. బంధువులు, తెలిసిన వాళ్లను కూడా అడిగి చూశారు. అయితే ఎటువంటి లాభం లేకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న నాగరాజు మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్‌కు వెళ్లి.. నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు. నాగరాజు సమాచారం మేరకు పోలీసులు చెరువులో నుంచి కరుణాకర్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో కరుణాకర్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కరుణాకర్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు.