బడా గణేషుడు బైలెల్లిపోతున్నాడు... కన్నులపండగ్గా ఖైరతాబాద్ వినాయక శోభాయాత్ర (ఫోటోలు)
హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వైపు వడివడిగా సాగుతున్నారు. బొజ్జ గణపయ్య నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ భక్తుల జయజయధ్వానాలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల మధ్య బడా గణేషుడు బైలెల్లుతున్నాడు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తికానుంది. పదకొండు రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న విఘ్ననాయకుడు నేడు సాగర జలాల్లో కలవనున్నాడు.
Khairatabad Ganesh
అశేష భక్తజనులు వెంటరాగా ఖైరతాబాద్ మహా గణనాథుడు హుస్సేన్ సాగర్ దిశగా నిమజ్జనం కోసం కదులుతున్నాడు. మహా గణపతి శోభాయాత్ర అట్టహాసంగా సాగుతోంది.
Khairatabad Ganesh
బొజ్జ గణపయ్య శోభాయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా అటు నిర్వహకులు, ఇటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ముందుగానే ఏర్పాట్లుచేసారు. దీంతో నిమజ్జనం సాపీగా సాాగుతోంది.
Khairatabad Ganesh
మహాగణపతి శోభాయాత్రలో మహిళల నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయం ఉట్టిపడే వేషధారణలో మహిళలు లంబోదరుడి శోభాయాత్రకు తరలివచ్చారు.
Khairatabad Ganesh
బోలో గణేష్ మహరాాజ్ కి జై అంటూ భక్తులు చేస్తున్న నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంతం మారుమోగుతోంది. గణనాథుడి నామస్మరణ మధ్య శోభాయాత్ర ముందుకు సాగుతోంది.
Khairatabad Ganesh
ఖైరతాాబాద్ గణేషుడు శోభాయాాత్ర ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యింది. చివరి పూజ అనంతరం బడా గణపతి హుస్సేన్ సాగర్ వైపు బైలెల్లాడు.
Khairatabad Ganesh
భారీ గణనాథుడి శోభాయాత్రతో ఖైరతాబాద్ ప్రాంతం కాషాయమయం అయ్యింది. కాషాయ పగిడీలు, టోపీలు, కండువాలు ధరించిన భక్తులు గణనాథుడి ఊరేగింపులో పాల్గొన్నారు.
Khairatabad Ganesh
పెద్ద పెద్ద భవనాల మధ్య అంతే ఎత్తులోని గణనాథుడి విగ్రహం తరలివస్తుంటే చూసేందుకు రెండుకళ్లు చాలడంలేదు. భక్తులు దారిపొడవునా నిల్చుని స్వామిని దర్శించుకుంటున్నారు.
Khairatabad Ganesh
భక్తజనసందోహం మద్యలోంచి బొజ్జ గణపయ్య కదులుతున్నాడు. బడా గణేషుడి నిమజ్జనం మద్యాహ్నానికి హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకోనున్నారు.
Ganesh idols
ఇదిలావుంటే ఇప్పటికే హుస్సేన్ సాగర్ కు భారీగా వినాయక విగ్రహాలు చేరుకున్నాయి. దీంతో ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం కంటే ముందే చాలా విగ్రహాలు సాగర్ నీటిలో కలిసిపోతున్నాయి.
Khairatabad Ganesh
ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. అంతెత్తున నిలిచిన స్వామి అతిత్వరలో హుస్సేన్ సాగర్ నీటిలోకి చేరనున్నాడు.
Ganesh idols
ఓ పక్క రాజసంగా నిలిచిన నూతన సచివాలయ భవనం, మరోవైపు అద్దంలా మెరిసిపోతున్న అమరుల స్మారకం మధ్యలోంచి గణనాథులు సాగరం వైపు తరలుతున్నారు.
Khairatabad Ganesh
ఖైరతాబాద్ నుండి హుస్సేన్ సాగర్ వరకు గణనాథుడి శోభాయాత్ర సాగనుంది. హుస్సేన్ సాగర్ జలాల్లోకి బడా గణేషుడు చేరడంతో ఈ నిమజ్జన కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత నగరవ్యాప్తంగా వున్న గణనాథుల విగ్రహాల నిమజ్జనం ప్రారంభంకానుంది.