అంతుబట్టని కేసీఆర్ అంతరంగం: ఆందోళనలో గులాబీ నేతలు

First Published 11, Oct 2019, 8:02 AM

తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో ఆందోళన నెలకొంది. నామినేటేడ్ పోస్టుల భర్తీ కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ పోస్టుల భర్తీ విషయంలో కేసీఆర్ నుండి స్పందన రాకపోవడంతో వారంతా నిరాశలో మునిగిపోయారు.

నామినేటేడ్ పదవుల భర్తీ విషయంలో కేసీఆర్ మదిలో ఏముందనే విషయమై స్పష్టత రాకపోవడంతో పలువురు నేతలు, వారి అనుచరులు  రాజకీయ భవితవ్యంపై ఆందోళనగా ఉన్నారు.

మంత్రివర్గ విస్తరణ తర్వాత నామినేటేడ్ పోస్టుల భర్తీని పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే నామినేటేడ్ పదవులను భర్తీ చేసే విషయంలో  గులాబీ దళపతి మనసులో ఏముందనే విషయమై క్లారిటీ రాలేదు.

మంత్రివర్గంలో చోటు కోసం ఎదురుచూసిన కొందరికి కార్పోరేషన్ పదవులు, విప్, చీప్ విప్ పదవులు కట్టబెట్టారు. మరికొందరు ప్రజా ప్రతినిధులు. పార్టీలోని సీనియర్లకు నామినేటేడ్ పదవులను కట్టబెట్టనున్నారు కేసీఆర్. అయితే నామినేటేడ్ పదవులను ఎప్పుడు కట్టబెడతారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

మంత్రివర్గ విస్తరణ సమయంలో నామినేటేడ్ పదవులను కట్టబెట్టనున్నట్టు కొందరు నేతలకు నెల రోజుల క్రితం సీఎం కేసీఆర్ పదవులు కట్టబెట్టారు.నెల రోజుల క్రితం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదు. తమకే నామినేటేడ్ పదవులు కట్టబెట్టలేదు. తమను నమ్ముకొన్న వారిని ఎలా కాపాడుకోవాలనే విషయమై పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

పార్టీలో తమ ప్రత్యర్థులు లేదా మొదటి నుండి పార్టీలో లేని వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యత లభించడంపై కూడ మొదటి నుండి పార్టీలో ఉన్న వారికి కొంత అసంతృప్తి ఉంది.

దీంతోనే ఇతర పార్టీల వైపు వెళ్లాలని కొందరు నేతలపై కిందిస్థాయి కేడర్ ఒత్తిడి తీసుకొస్తోందనే ప్రచారం కూడ లేకపోలేదు.మాజీ మంత్రులు కడియం శ్రీహరి, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వర్ రావు, నాయిని నర్సింహారెడ్డిలకు కేబినెట్ లో చోటు దక్కలేదు.

తమకు ప్రాధాన్యత ఇవ్వని విషయమై కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. నాయిని నర్సింహ్మారెడ్డి, రాజయ్య, జోగు రామన్న కేబినెట్ విస్తరణపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అయితే ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు టీఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించింది.

2014లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జోగు రామన్న, ఆజ్మీరా చందులాల్, పట్నం మహేందర్ రెడ్డిలు మంత్రులుగా ఉన్నారు. వీరికి ఈ దఫా  కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే వీరూ కూడ నామినేటేడ్ పదవులను ఆశిస్తున్నారు.

మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు కూడ గౌరవమైన పదవిని ఇస్తామని టీఆర్ఎస్ నాయకత్వం హామీ ఇచ్చింది. అయితే నిజామాబాద్ ఎంపీ స్థానంలో కవిత ఓటమి పాలు కావడంతో ఆయనకు ఇంకా నామినేటేడ్ పదవి దక్కలేదు.

తొలి తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్ గా పనిచేసిన మధుసూధనాచారి కూడ నామినేటేడ్ పోస్టు కోసం ఎదురుచూస్తున్నారు.మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ డిప్యూటీ స్పీకర్  పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు కూడ నామినేటేడ్ పోస్టు కోసం ఆసక్తిగా ఉన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరిన మండవ వెంకటేశ్వర్ రావు కూడ నామినేటేడ్ పోస్టు కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్, మండవ వెంకటేశ్వర్ రావులు మంచి మిత్రులు. టీడీపీలో ఉన్న సమయం నుండి వీరిద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి.

నామినేటేడ్ పోస్టుల కోసం ఆసక్తిగా ఉన్నవారు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మండవ వెంకటేశ్వర రావు, కెఆర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులు రాజ్యసభ సీటు కోసం ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అయితే కేసీఆర్ మాత్రం తన మనసులో మాటను బయటపెట్టలేదు.

నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసే ముహుర్తం ఎప్పుడు ఖరారు చేస్తారోనని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేటేడ్ పోస్టుల్లో తమను భర్తీ చేయాలని ఆశావాహులు కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

loader