కేటీఆర్ కి సీఎం పీఠం: కేసీఆర్ నయా భారత్ వ్యూహం?

First Published 7, Sep 2020, 12:56 PM

కేసీఆర్ దేన్నైనా చాలా బలంగా, బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తారు. ఆయన కలలు కూడా అదే రీతిలో పెద్దవిగానే ఉంటాయి. ఆయన జాతీయ రాజకీయాల గురించి ఎప్పటినుండో మాట్లాడుతుండడమే కాకుండా.... బీజేపీ, కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటినుండో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అవడంపై, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం పై విస్తృతమైన చర్చ సాగుతుంది. అన్ని కుదిరితే...మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల తరువాత వాస్తవానికి కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామనుకున్నారు. అందుకోసం విపక్షాలన్నిటిని కలిశారు కూడా.

కానీ బీజేపీకే సొంతగా 300 పైచిలుకు సీట్లు సాధించడంతో కేసీఆర్ జాతీయ స్థాయిలో తనదైన ముద్రను వేయలేకపోయారు. ఇక అప్పటినుండి ఆయన రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైనప్పటికీ... దేశ రాజకీయాల వైపు మాత్రం ఒక కన్నేసి ఉంచారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై కన్నేశారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.

ప్రస్తుత పరిస్థితులని మనం అవగతం చేసుకునే ముందు కేసీఆర్ శైలిని ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. కేసీఆర్ దేన్నైనా చాలా బలంగా, బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తారు. ఆయన కలలు కూడా అదే రీతిలో పెద్దవిగానే ఉంటాయి. ఆయన జాతీయ రాజకీయాల గురించి ఎప్పటినుండో మాట్లాడుతుండడమే కాకుండా.... బీజేపీ, కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. కవిత వంటివారు సైతం కేసీఆర్ ప్రధాని కాకూడదా అనే వ్యాఖ్యలను చేసారు.

కేసీఆర్ కూడా పలు మీటింగ్లలో దేశంలో ఒక ప్రత్యామ్నాయం కావాలని అన్నారు. ఇక దానికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ జమిలి ఎన్నికలవైపుగా చూస్తుందని విషయం అందరికి తెలిసిందే. ఎప్పటినుండో కూడా వన్ నేషన్ వన్ పాలసీ పేరుతో.... ప్రతికార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు

వీటిలో భాగంగానే వన్ నేషన్ వన్ కార్డు, వన్ నేషన్ వన్ టాక్స్ వంటి అనే పథకాలను రూపొందించారు. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరిట జమిలి ఎన్నికలకు తెర తీయ బోతున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. మమతా బెనర్జీ, కేసీఆర్ నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలకు వెళ్తే బీజేపీకి అత్యంత లాభం. మోడీ చరిష్మా ద్వారా కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చు. రాష్ట్రాలకు ఎన్నికలు కూడా ఇప్పుడే నిర్వహిస్తే... రాష్ట్ర రాజకీయ విషయాలు కూడా మరుగున పడిపోయి జాతీయ అంశాలు మాత్రమే తెర మీదకు వస్తే తమకు లాభమని బీజేపీ చూస్తుంది.

ఇదే జరిగితే.... బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతోపాటుగా అత్యధిక రాష్ట్రాల్లో అధికారాన్ని కూడా హస్తగతం చేసుకుంటుంది. ఇక్కడితో మాత్రమే బీజేపీ ఊరుకోవాలనుకోవడం లేదు. పార్లమెంటరీ పద్ధతి బదులుగా అధ్యక్ష తరహా పాలనను తీసుకురావాలని భావిస్తుంది బీజేపీ.

అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలను గనుక బీజేపీ ఏర్పాటు చేస్తే ఈ సవరణ తేలికయిపోతుందని బీజేపీ భావిస్తుంది. ఒకసారి అధ్యక్ష తరహా పాలనా గనుక వస్తే.... ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకే పరిమితమైపోతాయి.

జాతీయ పార్టీలు మాత్రమే అధ్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకునే వీలుంటుంది. ఇదే జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడే ప్రశ్నార్థకం అవ్వచ్చు. దీన్నే అజెండాగా చేసుకొని కేసీఆర్ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే కేసీఆర్ మాట్లాడినట్టు తెలియవస్తుంది.

మమతా బెనర్జీ, హేమంత్ సొరేన్ వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రులతో కేసీఆర్ మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఒక నూతన పార్టీని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో ఒక ప్రభంజనం సృష్టించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలియవస్తుంది. దేశంలో రాజ్యాంగ విలువలను రక్షించాలంటే అందరం కలిసి కట్టుగా వెళ్ళాలిసిందే అని కేసీఆర్ ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలియవస్తుంది.

దానిపేరు నయా భరత్ అని కూడా కొన్ని కథనాలు వస్తున్నప్పటికీ... ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం ఈ విషయంలో క్లారిటీ రావడం లేదు. కాకపోతే ఇప్పటికే ఈ పేరున రాజకీయ పార్టీ రిజిస్టర్ అయి ఉంది. దాన్ని చేసింది కేసీఆర్ మాత్రం కాదు. ఈ నేపథ్యంలో వేరే పేరు మీద పార్టీ పెడతారా, లేదా ఆ పార్టీ రిజిస్టర్ చేసిన వారితో చర్చించి అదే పేరును ఖాయం చేస్తారా అనేది వేచి చూడాలి.

జమిలి ఎన్నికలు తెర మీదకు వచ్చిన వేళ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపుగా చూస్తున్నట్టు అర్థమవుతుంది. వేచి చూడాలి, ఇది ఎన్ని రోజుల్లో కార్యరూపం దాలుస్తుందో..!

loader