MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Telangana
  • KCR: నా కొడకా.. నా చావు కోరుకుంటావా? వెయ్యి జన్మలెత్తినా నన్ను ఏమీ చేయలేరు ! కేసీఆర్ మాస్ కౌంటర్

KCR: నా కొడకా.. నా చావు కోరుకుంటావా? వెయ్యి జన్మలెత్తినా నన్ను ఏమీ చేయలేరు ! కేసీఆర్ మాస్ కౌంటర్

KCR: జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. వెయ్యి జన్మలెత్తినా నన్ను ఏమీ చేయలేరు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడే జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 20 2026, 09:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జగిత్యాల గడ్డపై గులాబీ గర్జన.. వెయ్యి జన్మలెత్తినా నన్ను తాకలేరంటూ కేసీఆర్ విశ్వరూపం
Image Credit : KCR Twitter

జగిత్యాల గడ్డపై గులాబీ గర్జన.. వెయ్యి జన్మలెత్తినా నన్ను తాకలేరంటూ కేసీఆర్ విశ్వరూపం

జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని శాపనార్థాలు పెడుతున్నారు. ఒరేయ్ నాయనా.. నువ్వు వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్‌ను ఏమీ చేయలేవు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ ఎదవలు మొరిగితే ఏమొస్తుంది?" అంటూ నిప్పులు చెరిగారు. ఒక చిన్న కథను ఉదాహరణగా చెప్తూ.. ఉట్టికి అందక పిల్లి పెట్టిన శాపాలకు ఉట్టి తెగదు, అలాగే మీ విమర్శలకు కేసీఆర్ భయపడడు అని స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. పదేళ్ల ప్రగతిపై కేసీఆర్
Image Credit : KCR Twitter

అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. పదేళ్ల ప్రగతిపై కేసీఆర్

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం సాధించిన ప్రగతిని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. "మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నాం, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చాం. శాసనసభలో నిలబడి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పిన దమ్మున్న ప్రభుత్వం మాది. మరి ఇప్పుడు నీళ్లకు ఎందుకు కరవు వచ్చింది?" అని కాంగ్రెస్ పాలనను ప్రశ్నించారు. ప్రజల కోసం చివరి శ్వాస వరకు పోరాడుతానని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరికీ తాకట్టు పెట్టనివ్వనని ఉద్వేగంగా మాట్లాడారు.

35
బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. 45 ఏళ్ల స్నేహం అన్న కేసీఆర్
Image Credit : Asianet News

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. 45 ఏళ్ల స్నేహం అన్న కేసీఆర్

ఈ సభలో అతిపెద్ద విశేషం సీనియర్ కాంగ్రెస్ నేత టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్, తక్షణమే ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. 45 ఏళ్లుగా తమ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ, రాజకీయంగా వేర్వేరు ధ్రువాల్లో ఉన్నా తమ బంధం ఎప్పుడూ విడిపోలేదని అన్నారు. జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీకి తిరుగులేని బలం చేకూరిందని ధీమా వ్యక్తం చేశారు.

45
మళ్లీ వచ్చేది మనమేనన్న కేసీఆర్
Image Credit : our own

మళ్లీ వచ్చేది మనమేనన్న కేసీఆర్

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుగా వ్యవహరించబోతోందని కేసీఆర్ సంకేతాలిచ్చారు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, ఆయన సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకుంటామని చెప్పారు. "వయసు అనేది కేవలం అంకె మాత్రమే. జీవన్ రెడ్డికి ఇప్పుడు 25 ఏళ్లు తగ్గిపోయాయి, ఒక యువకుడిలా ఆయన మాతో కలిసి నడుస్తారు" అంటూ కేడర్‌లో ఉత్సాహం నింపారు. ఆరు నూరైనా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని కేసీఆర్ జోస్యం చెప్పారు.

55
20 నెలల మానసిక క్షోభ.. జీవన్ రెడ్డి ఆవేదన
Image Credit : X/jeevanreddyMLC

20 నెలల మానసిక క్షోభ.. జీవన్ రెడ్డి ఆవేదన

పార్టీ మారిన అనంతరం జీవన్ రెడ్డి ప్రసంగిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. "కాంగ్రెస్ పార్టీ కోసం నలభై ఏళ్లు క్రమశిక్షణతో పనిచేశాను. కానీ గత 20 నెలలుగా పార్టీలో పడుతున్న అవమానాలు, పడుతున్న మానసిక క్షోభ వర్ణనాతీతం. నా ఉసురు పోసుకున్నారు" అని ఆవేదన చెందారు. కేసీఆర్ అందించిన అండతోనే తాను మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అవుతున్నానని, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని వెల్లడించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు కావడం లేదని, ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Top 10 Strongest Currencies : డాలర్ కాదు.. ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏది?
Recommended image2
Top 10 Unsolved Mysteries : దేవుడా.. ఇన్ని వింతలా? సైన్స్‌కు కూడా అందని ఆ 10 రహస్యాలు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved