హరీష్‌కు కీలక పదవి, బీజేపీకి చెక్: కేసీఆర్ ప్లాన్ ఇదీ

First Published Dec 31, 2020, 2:44 PM IST

బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ దిశగా టీఆర్ఎస్ చీఫ్ ప్లాన్ పార్టీలో మార్పులు చేర్పులకు ప్లాన్ చేస్తున్నారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనుహ్యంగా విజయం సాధించడంతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించడం టీఆర్ఎస్ కు మింగుడుపడలేదు.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  బీజేపీ 48 స్థానాలను గెలుచుకొంది.

ఈ రెండు ఎన్నికల్లో  బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబర్చింది.ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని అంతర్మథనంలో పడేశాయి.

కాంగ్రెస్ పార్టీని ఓవర్ టేక్ చేసి బీజేపీ ఓట్లు, సీట్లు సాధించడంతో టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు.

ఈ విషయమై పార్టీ నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారని సమాచారం.

దక్షిణాదిలో విస్తరించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ దశలో ఇటీవల కాలంలో తెలంగాణలో వచ్చిన అనుకూల ఫలితాలతో ఈ రాష్ట్రంపై బీజేపీ మరింతగా దృష్టి పెట్టింది.

రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికలకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని గులాబీ బాస్ వ్యూహారచన చేస్తున్నారు.

ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పామ్ హౌస్ లో కొందరు పార్టీ నేతలతో టీఆర్ఎస్ ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.

ప్రభుత్వం, పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సీనియర్లతో ఆయన మేథోమథనం చేసినట్టుగా సమాచారం.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలను కూడ టీఆర్ఎస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది.టీపీసీసీకి కొత్త చీఫ్ ను ఎంపిక చేయనున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మరోసారి అధికారంలోకి నూతన శక్తితో తిరిగి రావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకొన్నారు.

బండి సంజయ్ కు బీజేపీ నాయకత్వం పగ్గాలు అప్పగించింది. బీజేపీ పగ్గాలు సంజయ్ చేపట్టిన తర్వాత ఆ పార్టీ మంచి విజయాలను నమోదు చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ కూడ కొత్త పీసీసీ అధ్యక్షుడిని త్వరలోనే ప్రకటించనుంది.

సీనియర్ నేతలతో సీఎం కేసీఆర్ ముఖాముఖి చర్చించారని తెలిసింది. ఈ చర్చల్లో నేతల అభిప్రాయాల ఆధారంగా పార్టీ, ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి.

2021 మార్చిలో కేటీఆర్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

కేటీఆర్ ను సీఎం చేస్తే ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్లను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

రాష్ట్రంలో బీజేపీ బలపడితే రాజకీయంగా  తమకు నష్టమని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీని బలపడకుండా చేయడానికి పార్టీలోనూ, ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి నుండి అనేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు.

టీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని సీఎం పార్టీ నేతలకు సూచించారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?