మొదట షెకావత్... ఆ వెంటనే అమిత్ షాతో కేసీఆర్ భేటీ
First Published Dec 11, 2020, 9:43 PM IST
ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు సీఎం కేసీఆర్.

న్యూడిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుస బేటీ అవుతున్నారు. ఇవాళ(శుక్రవారం) డిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.

ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఆదివారం వరకు అంటే మూడురోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. డిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?