- Home
- Telangana
- July Holidays : ఈసారి 5 రోజుల లాంగ్ వీకెండ్.. ఈ శుక్రవారం నుండి మంగళవారం వరకు సెలవులేనా?
July Holidays : ఈసారి 5 రోజుల లాంగ్ వీకెండ్.. ఈ శుక్రవారం నుండి మంగళవారం వరకు సెలవులేనా?
School Holidays : ఈ నెలలో ఊహించని సెలవులు వస్తున్నాయి. ఒకట్రెండు కాదు ఈ వీకెండ్ లో వరుసగా ఐదురోజుల సెలవులను పొందవచ్చు… అంటే లాంగ్ వీకెండ్ అన్నమాట. ఏరోజు, ఎందుకు సెలవో తెలుసా?

ఈ వారం సెలవులే సెలవులు..
July Holidays : జూలైలో పండగలు, ప్రత్యేక పర్వదినాలు ఏమీ ఉండదు.. కాబట్టి సాధారణంగా రెండో, శనివారం, ఆదివారాలు తప్ప ఇతర సెలవులేమీ ఉండవు. వేసవి సెలవులు ముగియగానే వచ్చే నెల ఇది... అందుకే జూలై పేరంటేనే విద్యార్థులకు నచ్చదు. ఒక్క సెలవు లేకుండా నెలంతా వర్కింగ్ డేస్ ఉండే ఈ నెెల ఉద్యోగులకు కూడా నచ్చదు. అయితే ఈ జూలై అలాకాదు... తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవులు వస్తున్నాయి. ఏరోజు ఎందుకు సెలవుండే అవకాశాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
జూలై 10న విద్యాసంస్థల బంద్..
తెలంగాణ విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్దమయ్యాయి. ప్రైవేట్ విద్యాసంస్థలనే కాదు తమ యాజమాన్యంలో నడిచే ప్రభుత్వ విద్యాసంస్థలను కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని స్టూడెంట్స్ యూనియన్ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 10 (వచ్చే శుక్రవారం) రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఇటీవల రాజధాని హైదరాబాద్ లో SFI, AISF, PDSU వంటి ప్రధాన విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల బంధ్ నిర్ణయం తీసుకున్నారు. జూలై 10న విద్యాసంస్థల బంద్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు... స్కూల్స్ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ బంద్ లో స్వచ్చందంగా పాల్గొని సహకరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జూలై 14న మరో సెలవు...
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని... స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటోందని బిజెపి విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఆరోపిస్తోంది. విద్యార్థుల పక్షాన పోరాటానికి సిద్దమైన ఈ స్టూడెంట్ యూనియన్ కూడా ఈ నెలలోనే బంధ్ కు పిలుపునిచ్చింది. జూలై 14 (మంగవారం) రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల (జూనియర్ కాలేజీల నుండి యూనివర్సిటీల వరకు) బంద్ చేపట్టనుంది. ఈ మేరకు ఏబివిపి నాయకులు విద్యాసంస్థల బంద్ ప్రకటించారు.
ఈసారి లాంగ్ వీకెండ్?
విద్యార్థి సంఘాల నిరసనలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లిపోనుంది... దీంతో స్టూడెంట్స్ కి వరుస సెలవులు రాబోతున్నాయి. ఈ శుక్రవారం (జూలై 10) వామపక్ష విద్యార్థి సంఘాలు బంధ్ ఉంది... ఈరోజు స్కూల్స్ మూతపడనున్నాయి. తర్వాత రోజు రెండో శనివారం (జూలై 11) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవే. జూలై 12 ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. ఇలా ఈ వీకెండ్ వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారిపోయింది.
మూడ్రోజుల సెలవుల తర్వాత ఇలా విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయో లేదో అలా మరో సెలవు రానుంది. జూలై 14 (మంగళవారం) ఏబివిపి బంధ్ ఉంటుంది... అంటే మరోసారి విద్యాసంస్థలు మూతపడతాయి. మధ్యలో జూలై 13 (సోమవారం) ఒక్కరోజు మేనేజ్ చేసుకుంటే వరుసగా నాలుగైదు రోజులు హాలిడేసే. ఎండలు తగ్గి వర్షాలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది… కాబట్టి సెలవులుంటే మంచి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.
జూలైలో ఒకేఒక్క అధికారిక సెలవు.. ఏరోజో తెలుసా?
జూలైలో కేవలం ఒకేఒక్కరోజు అధికారిక సెలవు ఉంది. అదీ అందరికి కాదు... కేవలం కొంతమంది ఉద్యోగులకు మాత్రమే. జూలై 16న రథయాత్ర సందర్భంగా గవర్నమెంట్ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఇస్తున్నాయి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు. అంటే ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.
రెండో శనివారం, నాలుగు ఆదివారాలు మినహా మిగతా అన్నిరోజులు వర్కింగ్ డేసే. విద్యార్థులకు బంధ్ ల రూపంలో సెలవులు వస్తున్నాయి... కానీ ఉద్యోగులకు అలాంటి సెలవులేమీ లేవు. ప్రత్యేక సెలవులు లేకుండా పనిచేయాలి కాబట్టి జూలై నెల ఉద్యోగులకు కాస్త కష్టంగా గడవనుంది.

