MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • School Holidays : వేసవి సెలవుల పొడిగింపు ఎఫెక్ట్... రేపు రెండో శనివారం సెలవు ఉన్నట్లా, లేనట్లా?

School Holidays : వేసవి సెలవుల పొడిగింపు ఎఫెక్ట్... రేపు రెండో శనివారం సెలవు ఉన్నట్లా, లేనట్లా?

School Holidays : తెలంగాణ విద్యాసంస్థలకు రేపు రెండో శనివారం సెలవు ఉంటుందా, ఉండదా అనే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. క్లారిటీ కోసమే ఇక్కడ సమాచారం అందించాల్సి వస్తోంది.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 10 2026, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రేపు సెలవు ఉందా, లేదా?
Image Credit : getty

రేపు సెలవు ఉందా, లేదా?

School Holidays : రేపు (జూలై 11) రెండో శనివారం, ఎల్లుండి (జూలై 12 ఆదివారం)... వరుసగా రెండ్రోజులు సెలవు వస్తోందని ఎగిరిగంతేసేందుకు సిద్దమైన విద్యార్థులకు షాక్ తప్పడంలేదు. ఈ నెలలో రెండో శనివారం సెలవు లేనట్లేనని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు రేపు యధావిధిగా నడవనున్నాయి... కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా నడిచే అవకాశాలున్నాయి. అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండో శనివారం అయినప్పటికీ స్కూల్ కి వెళ్లాల్సిందే.

ప్రతి నెలలో రెండో శనివారం తప్పకుండా సెలవు ఉంటుంది. మరి ఈ జూలైలో మాత్రమే సెలవు ఎందుకు లేదు? ఇందుకు కారణమేంటి? అనేగా మీ డౌట్. అయితే మీరు ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే... వేసవి సెలవుల పొడిగింపు సమయంలో తెలంగాణ విద్యాశాఖ ప్రకటనను పరిశీలించాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రెండో శనివారం సెలవు లేనట్లేనా?
Image Credit : unsplash

రెండో శనివారం సెలవు లేనట్లేనా?

ఈసారి వేసవి సెలవులు ముగిసి జూన్ 12 నుండి నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకావాల్సింది. కానీ విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు జూన్ 12న కూడా వేసవి సెలవు కొనసాగించారు. దీంతో జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం మరో రెండ్రోజులు కలిసివచ్చాయి. ఇలా వేసవి సెలవులు మరో మూడ్రోజులు పెరిగాయి... జూన్ 15న (సోమవారం) తెలంగాణలో విద్యాసంస్థలు రీఓపెన్ అయ్యాయి.

అయితే ఊహించని విధంగా జూన్ 12న సెలవు ఇవ్వాల్సి రావడంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంవత్సరంలో ఓ వర్కింగ్ డే ను కోల్పోకుండా జూన్ 12 కు బదులు జూలైలో వచ్చే రెండో శనివారంను వర్కింగ్ డే గా ప్రకటించింది. ఇలా వేసవి సెలవుల పొడిగింపు ఎఫెక్ట్ రేపటి రెండో శనివారంపై పడింది... ప్రభుత్వ పాఠశాలలు యధావిధిగా నడవనున్నాయి.

Related Articles

Related image1
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Related image2
July Holidays : ఈసారి 5 రోజుల లాంగ్ వీకెండ్.. ఈ శుక్రవారం నుండి మంగళవారం వరకు సెలవులేనా?
34
ఈ స్కూళ్లకి రేపు సెలవే?
Image Credit : getty

ఈ స్కూళ్లకి రేపు సెలవే?

అయితే జూన్ 15న అమావాస్య కారణంగా చాలా ప్రైవేట్ విద్యాసంస్థలు స్కూల్ ప్రారంభించలేవు... కొన్ని ముందుగా ప్రకటించినట్లే జూన్ 12న తెర్చుకున్నాయి. ఇంకొన్ని విద్యాసంస్థలు జూన్ 16న పున:ప్రారంభం అయ్యాయి. అమావాస్య రోజు స్కూళ్లు తెరవడం శుభప్రదం కాదని ఇలా స్కూల్ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్ ఈ రెండో శనివారం సెలవు ఇస్తున్నాయి.

అయితే మీ పిల్లలకు ఈ రెండో శనివారం స్కూల్ ఉందో లేదో ఇప్పటికే క్లారిటీ వచ్చివుంటుంది... స్కూల్ నుండి మెసేజ్ వస్తే సెలవు ఉన్నట్లు... లేకుంటే లేనట్లే. ఇంకా స్కూల్, ఉందో లేదో అనే డైలమాలో ఉంటే వెంటనే సిబ్బందిని సంప్రదించండి. జూలై 12న ఆదివారం కాబట్టి అన్ని విద్యాసంస్థలకు సాధారణ సెలవు ఉంటుంది.

44
జూలై 14న విద్యాసంస్థల బంద్
Image Credit : Getty

జూలై 14న విద్యాసంస్థల బంద్

తెలంగాణలోని పలు విద్యార్థి సంఘాలు వరుసగా విద్యాసంస్థల బంద్ కు పిలుపు ఇస్తున్నాయి. ఇవాళ (జూలై 10, శుక్రవారం) SFI,AISF, PDSU వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ చేపడుతున్నాయి. అంటే ఇవాళ బంద్ కొనసాగి, రేపు రెండో శనివారం సెలవుంటే వరుసగా మూడ్రోజులు (జూలై 10,11,12) హాలిడేస్ కలిసిరానున్నాయి.

ఇక జూలై 14న బిజెపి విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) తెలంగాణలోని విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతోందని ఏబివిపి నాయకులు ఆరోపిస్తున్నారు... ఇందుకు నిరసనగానే వచ్చే మంగవారం రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల (జూనియర్ కాలేజీల నుండి యూనివర్సిటీల వరకు) బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Recommended image2
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image3
School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
Related Stories
Recommended image1
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Recommended image2
July Holidays : ఈసారి 5 రోజుల లాంగ్ వీకెండ్.. ఈ శుక్రవారం నుండి మంగళవారం వరకు సెలవులేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved