గెలుపే ధ్యేయం.. రంగంలోకి గులాబీ బాస్.. మరి లెక్కలు మారనున్నాయా.?
KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించగా.. బీఆర్ఎస్ ఇటీవల తమ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. మరి ఈ స్టోరీ చూసేయండి.

ఉత్కంఠగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కీలకంగా మారనుంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నవంబర్ 11న ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది.
రంగంలోకి కేసీఆర్..
జూబ్లీహిల్స్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను కూడా ప్రకటించింది. అందులో మొట్టమొదటి స్టార్ క్యాంపెయినర్ ఆ పార్టీ అధినేత కేసీఆర్. గులాబీ బాస్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ ప్రచారాన్ని చురుగ్గా నడిపించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేటీఆర్, హరీష్ రావు పేర్లు కూడా..
కేటీఆర్, హరీష్ రావు వంటి పేర్లతో పాటు, బీఆర్ఎస్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీ అధినేత కేసీఆర్‌ను కూడా చేర్చడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచేశాయి. 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలో కనిపించడం చాలా అరుదుగా మారింది.
జూబ్లీ హిల్స్ సీటు బీఆర్ఎస్‌కు ముఖ్యం..
ఒకవైపు మాగంటి గోపీనాథ్ కేసీఆర్‌కు సన్నిహితుడు కావడం.. మరోవైపు సిట్టింగ్ జూబ్లీ హిల్స్ సీటును గెలవడం బీఆర్ఎస్‌కు అత్యంత కీలకంగా మారింది. BRS ఈ స్థానాన్ని ఓడిపోతే.. ఆ పార్టీ మరిన్ని కష్టాలు ఎదుర్కోవడం ఖాయం.
కాంగ్రెస్ విజయం సాధిస్తే..
ఒకవేళ ఈ ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో మరింతగా బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కీలకమైన జూబ్లీహిల్స్ సీటును గెలుచుకోవడానికి తాను స్వయంగా మైదానంలోకి దిగడం సముచితమని కేసీఆర్ భావించినట్లు కనిపిస్తోంది.