MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Today Holiday : తెలంగాణలో నేడు కాలేజీలకు సెలవు... ఇకపై ప్రతినెలా ఈ రోజు హాలిడేనే

Today Holiday : తెలంగాణలో నేడు కాలేజీలకు సెలవు... ఇకపై ప్రతినెలా ఈ రోజు హాలిడేనే

Telangana Holidays : తెలంగాణలో కొన్ని కాలేజీలకు ఇవాళ సెలవు ఇచ్చారు. ఇలా ప్రతి నెలా నాలుగో శనివారం ఆ కాలేజీలకు సెలవు ఉంటుంది. ఇంతకూ ఆ కాలేజీలేవో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 22 2025, 07:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
JNTU holiday

JNTU holiday

College Holiday : తెలంగాణలో ఇంజనీరింగ్ చేసే విద్యార్థులకు జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (JNTU) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఈ యూనివర్సిటీ పరిధిలోకి కాలేజీలకు కేవలం ఆదివారం మాత్రమే సెలవు ఉండేది... కానీ ఇకపై నెలలోని నాలుగో శనివారం కూడా సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. 

జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వరరావు నాలుగో శనివారం హాలిడే కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంతో పాటు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. వైస్ చాన్సలర్ ఆదేశాల మేరకు నాలుగో శనివారం సెలవుపై ప్రకటన చేస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.  

కేవలం జేఎన్‌టీయూలో చదివే విద్యార్థులకే కాదు బోధనా,బోధనేతర సిబ్బందికి కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఈ నిర్ణయం ఫిబ్రవరిలోని నాలుగో శనివారం అంటే రేపు 22 నుండే అమలులోకి రానుంది. ఇలా నెలలో ఓ రోజు సెలవు అదనంగా వస్తుండటంతో జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
JNTU

JNTU

జేఎన్‌టీయూలో నాలుగో శనివారం సెలవు ఇప్పుడే కొత్తకాదు : 

జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నాలుగో శనివారం సెలవు ఇప్పుడే కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో 2008 కి ముందు ఇలాగే జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలకు నాలుగో శనివారం సెలవు ఉండేది.వివిధ కారణాలతో ఈ సెలవును రద్దుచేసారు. 

అయితే మళ్ళీ పదిహేడేళ్ల తర్వాత ఈ నాలుగో   శనివారం సెలవును పునరుద్దరించారు. దీంతో వరుసగా రెండురోజులు సెలవు వస్తుండటంతో విద్యార్థులతో పాటు యూనివర్సిటీ స్టాప్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతినెల చివర్లో ఇలాగే శని, ఆదివారాలు జేఎన్‌టీయూ కాలేజీలకు సెలవు ఉంటుంది. 
 

33
Holidays

Holidays

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండురోజులు సెలవు : 

ప్రస్తుతం నాలుగో శనివారం, ఆదివారం రెండ్రోజులు జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలకు సెలవులు వస్తున్నాయి. మళ్లీ రెండ్రోజులు కాలేజీలు నడుస్తాయో లేదో ఫిబ్రవరి 26న శివరాత్రి పండగ సెలవు వస్తుంది. కేవలం జేఎన్‌టీయూ కాలేజీలకే కాదు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్ధలు, కార్యాలయాలకు సెలవు ఉంటుంది.  

ఇక ఫిబ్రవరి 27న తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి.  తెలంగాణలో ఉమ్మడి మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ నియోజకవర్గంలో టీచర్ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో ఫిబ్రవరి 27 అంటే శివరాత్రి తర్వాతిరోజు పోలింగ్ జరగనుంది. కాబట్టి ఆయా జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలతో పాటే  జేఎన్‌టీయూ కాలేజీలకు సెలవు ఉండే అవకాశాలున్నాయి. 

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాగే ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tirupati: రూ. 1000 లోపే హైదరాబాద్ టు తిరుపతి టూర్‌ ప్లాన్.. అవును ఇలా చేస్తే సాధ్య‌మే
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. మరోవైపు సూపర్ ఎల్‌నినో, వడదెబ్బల ముప్పు !
Recommended image3
Now Playing
Bandi Bhagirath Controversy: బండి భగీరథ్ పై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved