- Home
- Telangana
- ఐఐటీ హైదరాబాద్ లో ఉద్యోగాలు.. తెలుగు యువతకు ఇదే ఛాన్స్ .. ఉదయం ఇలా వెళ్లి సాయంత్రం అలా జాబ్ తో తిరిగిరావచ్చు
ఐఐటీ హైదరాబాద్ లో ఉద్యోగాలు.. తెలుగు యువతకు ఇదే ఛాన్స్ .. ఉదయం ఇలా వెళ్లి సాయంత్రం అలా జాబ్ తో తిరిగిరావచ్చు
Hyderabad IIT Jobs : ప్రత్యేకంగా పోటీ పరీక్ష లేదు… మీకు ఈ అర్హతలుంటే చాలు… నేరుగా ఇంటర్వ్యూకు హాజరై ప్రతిభ చూపిస్తే హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగం మీ సొంతం.

ఐఐటీ హైదరాబాద్ జాబ్స్ నోటిఫికేషన్
IIT Hyderabad Jobs : తెలుగు యువతకు అద్భుత అవకాశం.. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీకు అన్ని అర్హతలుండి ఐఐటి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే ఇక సిద్దంకండి. నేరుగా ఇంటర్వ్యూకు హాజరై ప్రతిభ చూపిస్తే ఉద్యోగం పక్కా. మంచి సాలరీతో ఈ ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది హైదరాబాద్ ఐఐటి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.
ఐఐటి హైదరాబాద్ లో ఖాళీలు, రిజర్వేషన్లు, వయోపరిమితి
ఐఐటి హైదరాబాద్ లో లైబ్రెరియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 02 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఒకటి ఎస్టి అభ్యర్థులకు రిజర్వ్ చేయగా ఇంకొకటి అన్ రిజర్వుడ్. అంటే ఎవరైనా దీనికి ప్రయత్నించవచ్చు.
వయో పరిమితి :
ఐఐటి హైదరాబాద్ ఉద్యోగాలకు ప్రయత్నించే అభ్యర్థుల వయసు 25 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు
అభ్యర్థులు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఆండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (MLIS) లేదా ఇందుకు సమానమైన విద్యార్హతలు కలిగివుండాలి. 2024 లేదా 2025 లో ఈ కోర్సు పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు.
లైబ్రరీకి సంబంధించి సాధారణ ఐటీ లేదా ఐటి అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
నేరుగా విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని హైదరాబాద్ శివారులోకి ఐఐటి క్యాంపస్ కు వెళ్లాలి. 27 అక్టోబర్ 2025 సోమవారం ఉదయమే క్యాంపస్ లోని A-బ్లాక్ ఆడిటోరియం వాక్ ఇన్ సెలెక్షన్ జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే రోజు రాత పరీక్ష, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఉంటాయి.
టైమింగ్స్ :
రిపోర్టింగ్ టైమ్ : 9:30 AM
రాత పరీక్ష : 11 AM to 12.30 PM
రాత పరీక్ష రిజల్ట్ : 2 PM
డాక్యుమెంట్ వెరిఫికేషన్ : 2.30 PM నుండి ప్రారంభం
రాత పరీక్షలో అర్హత సాధించి, సర్టిఫికేట్స్ క్లియర్ గా ఉంటే పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీని ఆధారంగానే ఫైనల్ గా లైబ్రెరియన్ ట్రైనీ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు ఆరురోజులు మూడు షిప్టులు (ఉదయం, సాయంత్రం, రాత్రి) ఎప్పుడైనా పనిచేయాల్సి ఉంటుంది.
సాలరీ
నెలనెలా రూ.30,000 సాలరీ లభిస్తుంది. అయితే ప్రత్యేక అలవెన్సుల వర్తించవని ఐఐటీ హైదరాబాద్ ప్రకటనలో పేర్కొంది.
గమనిక :
కేవలం ఏడాదిపాటు కాంట్రాక్ట్ పద్దతిలో ఈ నియామకం చేపడుతున్నారు. తర్వాత ఉద్యోగి పనితీరు బాగుంటే, సంస్థకు సేవలు ఇంకా అవసరం ఉంటే కాంట్రాక్ట్ ను పొడిగిస్తారు.