MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • డ‌బ్బులు తీసుకున్నారు, ఓట్లు వేయ‌లేదు.. జూబ్లిహిల్స్ ఎన్నిక‌లపై కొత్త ర‌చ్చ

డ‌బ్బులు తీసుకున్నారు, ఓట్లు వేయ‌లేదు.. జూబ్లిహిల్స్ ఎన్నిక‌లపై కొత్త ర‌చ్చ

Hyderabad: జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక‌ను పార్టీలు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌లో పోలింగ్ తక్కువగా నమోదు కావడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ చ‌ర్చ నడుస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 13 2025, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓటు వేయని వారిపై అసహనం
Image Credit : Twitter

ఓటు వేయని వారిపై అసహనం

ఉపఎన్నికలో పోలింగ్ శాతం 50% కూడా దాటకపోవడంతో కాంగ్రెస్ నాయ‌కులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. కొంతమంది ఓటర్లకు డబ్బులు ఇచ్చినప్పటికీ, వారు ఓటు వేయలేదని బూత్ ఏజెంట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఒక ఇంట్లో 18 మందికి డబ్బులు ఇచ్చి, కేవలం నలుగురు మాత్రమే ఓటు వేసినట్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఓటు వెయ్యని వారు డబ్బులు తిరిగి ఇయ్యండి!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బులు తీసుకుని ఓటు వేయని వారిని గుర్తించి వెనక్కి తీసుకునే పనిలో పడ్డ కాంగ్రెస్

పోలింగ్ శాతం కనీసం 50% కూడా నమోదు కాకపోవడంతో, తీవ్ర అసహనం

ఒక ఇంట్లో 18 ఓట్లకు డబ్బు తీసుకుని కేవలం 4 మంది ఓటు వేయడం, అపార్ట్మెంట్… pic.twitter.com/niHKxv1y3m

— Telugu Scribe (@TeluguScribe) November 13, 2025

25
డ‌బ్బులు వెన‌క్కి ఇవ్వాలంటూ..
Image Credit : Asianet News

డ‌బ్బులు వెన‌క్కి ఇవ్వాలంటూ..

కొన్ని కాలనీలు, అపార్ట్మెంట్లలో కాంగ్రెస్ కార్యకర్తలు ఓటు వేయని వారిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారని వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలు జూబ్లీహిల్స్, వెంగలరావు నగర్, SPR హిల్ ఏరియాల్లో జరిగాయన్న ప్రచారం సాగుతోంది.

ఒరేయ్ స్క్రైబ్... అది మీ పార్టీ వాళ్లే చేసింది.. నిన్న.. SPR హిల్, site3,వెంగలరావు నగర్ ఏరియా ల లో... ఆడియో రికార్డ్స్ బయట పెట్టాలా...

— Hemanth393 (@Hemanth3931) November 13, 2025

Related Articles

Related image1
భార‌త యువ‌కుడికి తొలి క్యాన్స‌ర్ వ్యాక్సిన్‌.. మ‌ర‌ణాన్ని జ‌యించ‌నున్న శ్రీవాస్త‌వ
Related image2
ఢిల్లీలో మరోసారి పేలుడు కలకలం.. ఒక్కసారిగా భారీ శబ్ధం. అసలేం జరిగిందంటే
35
ఖండించిన‌ కాంగ్రెస్
Image Credit : Twitter

ఖండించిన‌ కాంగ్రెస్

అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయ‌కులు పోస్టులు చేస్తున్నారు. ఇవ‌న్నీ పూర్తిగా అవాస్తమ‌ని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికబద్ధంగా ప్రచారం చేస్తున్నాయ‌ని వాదిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీనే ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిందంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

45
ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ
Image Credit : EC Twitter

ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. చాణక్య, హెచ్‌ఎంఆర్‌, స్మార్ట్‌ పోల్ సర్వేలు — కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు అంచనా వేశాయి. మాగంటి గోపీనాథ్‌ భార్య సునీత (భారత రాష్ట్ర సమితి), నవీన్‌ యాదవ్‌ (కాంగ్రెస్‌), లంకల దీపక్‌రెడ్డి (BJP) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

55
కౌంటింగ్‌కు స‌ర్వం సిద్ధం
Image Credit : Twitter

కౌంటింగ్‌కు స‌ర్వం సిద్ధం

జూబ్లిహిల్స్ ఎన్నిక‌ల ఫ‌లితం మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది. శుక్ర‌వారం కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ఓట్ల లెక్కింపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జరగనుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఓట్లు 10 రౌండ్లలో లెక్కిస్తారు. భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పోలింగ్ శాతం 48.49గా నమోదైన విష‌యం తెలిసిందే.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
Recommended image2
మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. రూ. 4వేల కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు, క‌ళ్లు చెదిరే మార్పులు
Recommended image3
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Related Stories
Recommended image1
భార‌త యువ‌కుడికి తొలి క్యాన్స‌ర్ వ్యాక్సిన్‌.. మ‌ర‌ణాన్ని జ‌యించ‌నున్న శ్రీవాస్త‌వ
Recommended image2
ఢిల్లీలో మరోసారి పేలుడు కలకలం.. ఒక్కసారిగా భారీ శబ్ధం. అసలేం జరిగిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved