- Home
- Telangana
- హైదరాబాద్ లో ఈ గణేషుడు యమ రిచ్ గురూ.. చేతిలోని 10 కిలోల లడ్డూకే రూ.2.32 కోట్లేంటి సామీ..!
హైదరాబాద్ లో ఈ గణేషుడు యమ రిచ్ గురూ.. చేతిలోని 10 కిలోల లడ్డూకే రూ.2.32 కోట్లేంటి సామీ..!
హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు అనగానే ఖైరతాబాద్, బాలాపూర్ లే గుర్తుకువస్తాయి. ఓచోటు మహాగణపతికి, మరోచోటు మహా పవిత్ర లడ్డూకు ఫేమస్. అయితే తాజాగా మరోప్రాంతం కూడా లడ్డూ వేలంపాటకు ఫేమస్ గా మారింది. అక్కడ ఈసారి గణపతి లడ్డూ ధరెంతో తెలుసా?

గణపతి లడ్డూకు రూ.2.32 కోట్ల ధర...
Vinayaka Laddu : బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డూకు ఎంత డిమాండ్ ఉంటుందో హైదరాబాద్ ప్రజలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల వినాయకుడి చేతిలో పూజలందకున్న లడ్డూలను వేలంపాటలో లక్షలాది రూపాయలకు కొనుగోలు చేసిన సంఘటనలు చూశాం. కానీ ఇప్పుడు అది కోట్లకు చేరింది…హైదరాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటుచేసిన గణపతి చేతిలోని లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది. ఇది గణపతి లడ్డూ వేలంలోనే ఆల్ టైమ్ రికార్డుగా చెప్పవచ్చు
కీర్తి రిచ్ మండ్ విల్లా ఆల్ టైమ్ రికార్డు...
రాజేంద్రనగర్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లా గత కొన్నేళ్ళుగా బాలాపూర్ లడ్డూతో పోటీ పడుతున్న విషయం. గతేడాది కూడా ఇక్కడే అత్యధిక ధరకు లడ్డూను సొంత చేసుకున్నారు. ఈసారి వేలంలో ఏకంగా రూ.2.32 కోట్లకు గణపతి లడ్డూను కైవసం చేసుకున్నారు బాల్ గణేష్ టీం సభ్యులు. గణపతి లడ్డూ ఇంత భారీ ధర పలకడంతో ఈ రిచ్ మండ్ విల్లా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత రెండేళ్ళు కూడా రిచ్ మండ్ విల్లా లడ్డూది రికార్డే..
గత నాలుగైదు సంవత్సరాలుగా కీర్తి రిచ్ మండ్ విల్లాలో నిర్వహించే వినాయక లడ్డూ వేలంపాట చర్చనీయాంశంగా మారుతోంది. 2023 లో రూ.1.26 కోట్లు పలికింది గణపతి లడ్డూ... ఇక గతేడాది అంటే 2024 లో ఇది మరికొంత పెరిగి రూ.1.87 కోట్లు పలికింది. ఇవే అత్యధికం అనుకుంటే ఈసారి గణపతి లడ్డూ ధర మరింత పెరిగి రెండుకోట్లు దాటడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బాలాపూర్ లడ్డూ వేలంపాటకు సర్వం సిద్దం
ఇక తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన బాలాపూర్ లడ్డూ వేలంపాట ఇవాళ(శనివారం) జరగనుంది. ఈ లడ్డూ వేలం పాటలో పాల్గొనేందుకు ఇప్పటికే 38 మంది పేర్లు నమోదు చేసుకున్నారు... వీరిలో ఓ ఏడెనిమిది మంది మధ్య పోటాపోటీగా లడ్డూ వేలం పాట జరిగే అవకాశాలుంటాయి. మర్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, లింగాల దశరథ, కంచర్ల శివరాంరెడ్డి, సామ రామ్‌రెడ్డి, పీఎస్‌కే గ్రూప్, జిట్టా పద్మాసురేందర్‌రెడ్డి వంటివారు వేలంపాటలో పాల్గొననున్నారు.
ఈసారి బాలాపూర్ లడ్డూ ఎంత పలుకుతుందో..
బాలాపూర్ లో లడ్డూ వేలంపాటకు సర్వం సిద్ధం చేశారు. ఉదయం నుంచే బాలాపూర్ గణేష్‌కు ప్రత్యేక పూజలు చేస్తున్నారు... కొద్దిసేపట్లో గణేషుడి నిమజ్జన ఊరేగింపు ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటలకు గ్రామంలోని బొడ్రాయి దగ్గరికి ఈ వినాయక ఊరేగింపు చేరుకుంటుంది… తర్వాత లడ్డూ వేలంపాట ప్రారంభంకానుంది. గతేడాది వేలంపాటలో గణపతి లడ్డూను రూ.30 లక్షల వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. మరి ఈసారి బాలాపూర్ లడ్డూ ఎంత ధర పలుకుతుంది? ఎవరికి దక్కుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.