MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • 2025 లో భారీ సెలవుల కోసం ఈ ట్రిక్ ఫాలోకండి ... ఏకంగా 50 రోజుల హాలిడేస్ పొందండి

2025 లో భారీ సెలవుల కోసం ఈ ట్రిక్ ఫాలోకండి ... ఏకంగా 50 రోజుల హాలిడేస్ పొందండి

వచ్చే ఏడాది 2025 లో భారీగా సెలవులను పొందే అద్భుత అవకాశం. కేవలం 12 రోజులు సెలవులు పెడితే చాలా... ఎన్నో లాంగ్ వీకెండ్స్ మీ సొంతం. అదెలాగో చూద్దాం. 

4 Min read
Author : Arun Kumar P
| Updated : Dec 04 2024, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Holidays in 2025

Holidays in 2025

Holidays in 2025 : హాలిడేస్ ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి... స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులే కాదు ఉద్యోగాలు చేసేవారు కూడా సెలవులంటే ఎగిరి గంతేస్తారు. ముఖ్యంగా ఈ సెలవులు వీకెండ్ తో కలిసివస్తే వారి ఆనందానికి అవధులు వుండవు. ఈ లాంగ్ వీకెండ్స్ లో కుటుంబంతో హాయిగా గడపాలని, స్నేహితులతో సరదాగా షికారుకు వెళ్ళాలని కోరుకుంటారు. మరి వచ్చే ఏడాది 2025 లో ఇలాంటి లాంగ్ వీకెండ్స్ ఎన్ని వచ్చాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.  

ఇప్పటికే 2025 లో స్కూళ్ళు, కాలేజీలకు వచ్చే సెలవులను తెలుగు ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సెలవులపైనా క్లారిటీ ఇచ్చాయి. ఇక పలు కార్పోరేట్ కంపనీలు కూడా 2025 లో వచ్చే పండగలు, కీలకమైన రోజులను దృష్టిలో వుంచుకుని హాలిడేస్ లిస్ట్ రెడీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓసారి 2025 క్యాలండర్ ను పరిశీలిస్తే సెలవులే సెలవులు కనిపిస్తున్నాయి.

సాధారణంగా కార్పోరేట్ సంస్థల ఉద్యోగులతో పాటు చాలా ప్రైవేట్ సంస్థలు శని,ఆదివారం రెండు రోజులు ఉద్యోగులకు సెలవులు ఇస్తాయి. అంటే ప్రతినెలా దాదాపు ఎనిమిది రోజులు సెలవే. వీటికి హాలిడేస్ తోడయినా, లాంగ్ వీకెండ్ కలిసివచ్చినా ఉద్యోగులకు పండగే. ఇక లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందంటే ఒకటి రెండ్రోజులు సెలవు పెట్టడానికి ఉద్యోగులు వెనకాడరు. ఇలా 2025 లో కేవలం 12 రోజులు సెలవు పెడితే ఏకంగా 50 రోజుల సెలవులు కలిసివస్తాయి. అదెలాగో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2025 లో సెలవులే సెలవులు : 

పాత సంవత్సరానికి మరికొద్ది రోజుల్లో స్వస్తిపలికి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో 2025 లో హాలిడేస్ గురించి ఓ ఆసక్తికర పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఏడాది మొత్తంలో వరుస సెలవులను ఎలా పొందాలన్నదే ఈ పోస్ట్ సారాంశం. హాలిడేస్ కు కొన్ని లీవ్స్ జతచేస్తే భారీగా లబ్ది పొందవచ్చనేది ఈ సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి. ఏ నెలలో ఎన్ని హాలిడేస్ వచ్చాయి? మనం లీవ్ పెడితే ఎలా కలిసివస్తాయో తెలుసుకుందాం.

జనవరి :

కొత్త సంవత్సరం సెలవుతోనే ప్రారంభం అవుతుంది. అలాగే ఈ నెలలో సంక్రాంతి పండగ వుంటుంది కాబట్టి మరికొన్ని సెలవులు కలిసివస్తాయి. ఇలా ప్రతి ఏడాదిలాగే 14న సంక్రాంతి సెలవు వుంటుంది. ఇది మంగళవారం వస్తోంది. శని, ఆదివారం ఎలాగూ హాలిడే వుంటుంది... ఒక్క సోమవారం సెలవు పెడితే వరుసగా నాలుగురోజులు కలిసివస్తాయి. అంటే 11,12,13,14 తేదీలు సెలవు పొందవచ్చు. ఈ నాలుగు రోజులు హాయిగా సొంతూళ్లకు వెళ్ళి సంక్రాంతి పండగను హాయిగా కుటుంబంతో కలిసి జరుపుకోవచ్చు. 

ఫిబ్రవరి : 

ఈ నెలలో ఓ వారం మొత్తం సెలవు తీసుకునే అవకాశం వస్తుంది. ఫిబ్రవరి 2025 లో 26 తేదీన మహా శివరాత్రి వుంటుంది. ఈ పండగ సరిగ్గా వీక్ మిడిల్లో అంటే బుధవారం వస్తోంది. కాబట్టి  దీనికి అటు,ఇటు ఓ నాలుగురోజులు సెలవు తీసుకుంటే వరుసగా తొమ్మిదిరోజులు కలిసివస్తాయి. 

ఫిబ్రవరి 22 శనివారం, 23 ఆదివారం సెలవే. ఆ తర్వాత 24 సోమవారం, 25 మంగళవారం లీవ్ పెట్టుకుంటే 26 న మళ్ళీ శివరాత్రి హాలిడే వస్తుంది. ఇక 27,28 గురు,శుక్రవారం లీవ్ తీసుకుంటే ఈ నెల ముగుస్తుంది. మళ్లీ మార్చి 1,2 తేదీలు వీకెండ్... మరో రెండు సెలవులు కలిసివస్తాయి. ఇలా వరుసగా 9 రోజులు సెలవులు కలిసివస్తాయి...కాబట్టి కుటుంబంతో మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు...లేదంటే స్నేహితులతో చిల్ అయ్యేలా ప్లాన్ చేసుకోవచ్చు. 
 

35

మార్చ్ 2025 : 

ఈ నెలలో ఎలాంటి సెలవులు పెట్టకున్నా రెండుసార్లు లాంగ్ వీకెండ్ వస్తుంది. మార్చి 14, 2025 హోలీ పండగ శుక్రవారం వస్తోంది. కాబట్టి తర్వాతి రెండ్రోజులు 15,16 తేదీల్లో సెలవే.

ఇక నెల చివర్లో మరో లాంగ్ వీకెండ్ వస్తుంది.31 సోమవారం రంజాన్ పండగ. కాబట్టి వరుసగా 29,30,31 మూడురోజులు సెలవులు వుంటాయి. ముస్లిం ఉద్యోగులకు ఈ సెలవులు బాగా కలిసి వస్తున్నాయి.

 ఏప్రిల్ 2025 :

ఈ నెలలో 18వ తేదీన గుడ్ ఫ్రైడే వుంది. ఆ తర్వాత రెండ్రోజులు వీకెండ్. ఇలా మార్చిలో 18,19,20 తేదీల్లో లాంగ్ వీకెండ్ వస్తుంది. ఇది   పిల్లల పరీక్షల సమయం ... కాబట్టి టూరిస్ట్ ప్లేసెస్, దేవాలయాల్లో రద్దీ తక్కువగా వుంటుంది. మీరు బ్యాచిలర్స్ అయితే ఈ సెలవులు కలిసివస్తాయి.

మే 2025 : 

ఈ నెల ఆరంభమే లాంగ్ వీకెండ్. మేడే గురువారం వస్తోంది... ఆ రోజు ఎలాగూ హాలిడే వుంటుంది. శుక్రవారం ఒక్కరోజు లీవ్ తీసుకుంటే శని,ఆదివారం మళ్ళీ వీకెండ్ హాలిడేస్.ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు తీసుకోవచ్చు.

ఇక జూన్, జూలై పెద్దగా సెలవులేమీ లేవు. కేవలం శని,ఆదివారాల సెలవులు మాత్రమే.ఈ రెండు నెలలు ఉద్యోగులకు చాలా భారంగా గడుస్తాయి. 

45

ఆగస్ట్ 2025 : 

ఆగస్ట్ లో అయితే ఓ నాలుగు రోజులు లీవ్ పెడితే ఏకంగా 12 రోజుల హాలిడే తీసుకోవచ్చు.  ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం శుక్రవారం... ఆ తర్వాత 16,17 తేదీల్లో శని,ఆదివారం వీకెండ్. మూడు రోజుల వరుస సెలవులు వస్తాయి. 

ఇక 23,24 మరో వీకెండ్. ఆ తర్వాత రెండ్రోజుల లీవ్ తీసుకుంటే 27న వినాయక చవితి. బుధవారం పండగ సెలవు తర్వాత 28,29 తేదీలు లీవ్ తీసుకుంటే మరో వీకెండ్ వచ్చేస్తుంది.  అంటే 30,31 శని,ఆదివారం ఎలాగూ సెలవే. ఇలా వరుసగా 9 రోజుల సెలవు పొందవచ్చు.  

అక్టోబర్ 2025 : 

అక్టోబర్ 2 గాంధీ జయంతి గురువారం వస్తోంది. ఇదే రోజు దసరా వస్తోంది. తర్వాతి రోజు శుక్రవారం లీవ్ తీసుకుంటే శని, ఆదివారం మళ్లీ సెలవులే. ఇలా వరుసగా నాలుగు రోజులు (2,3,4,5 తేదీలు) సెలవు పొందవచ్చు. మధ్యలో దసరాకు సెల 

అక్టోబర్ 20న దీపావళి సోమవారం వస్తోంది. ముందు రెండ్రోజులు 18, 19 శని, ఆదివారాలు వీకెండ్. ఇలా 2025 దీపావళికి మూడు రోజుల సెలవు వస్తోంది. 

డిసెంబర్ 2025 :  

డిసెంబర్ 26న సెలవు తీసుకుంటే క్రిస్మస్ కు నాలుగు రోజులు కలిసివస్తాయి. 25 గురువారం క్రిస్మస్ కాబట్టి తర్వాతరోజు శుక్రవారం లీవ్ తీసుకుంటే శని, ఆదివారం కలిసివస్తాయి. ఇలా ఈ 2025 సంవత్సరాన్ని లాంగ్ వీకెండ్ తో ముగించవచ్చు. 

55
Holiday List 2025

Holiday List 2025

2025 లో సాధారణ సెలవుల లిస్ట్ : 

14 జనవరి (మంగళవారం) - మకర సంక్రాంతి 

26 జనవరి (ఆదివారం) ‌- రిపబ్లిక్ డే 

26 ఫిబ్రవరి (బుధవారం) - మహా శివరాత్రి 

14 మార్చ్ (శుక్రవారం) - హోలి 

30 మార్చ్ (ఆదివారం) - ఉగాది 

31 మార్చ్ (సోమవారం) - రంజాన్ 

10 ఏప్రిల్ (గురువారం) - మహవీర్ జయంతి 

18 ఏప్రిల్ (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే 

12 మే (సోమవారం) - బుద్ద పూర్ణిమ 

7 జూన్ (శనివారం) - బక్రీద్ 

6 జూలై (ఆదివారం) ‌- మొహర్రం 

15 ఆగస్ట్ (శుక్రవారం) - స్వాతంత్య్ర దినోత్సవం 

16 ఆగస్ట్ (శనివారం) - శ్రీకృష్ణ జన్మాష్టమి 

27 ఆగస్ట్ (బుధవారం) ‌- గణేష్ చతుర్థి 

5 సెప్టెంబర్ (శుక్రవారం) - ఓనం, మిలాద్ ఉల్ నబి 

2 అక్టోబర్ (గురువారం) - గాంధీ జయంతి, విజయ దశమి

20 అక్టోబర్ (సోమవారం) - దీపావళి 

5 నవంబర్ (బుధవారం) - గురునానక్ జయంతి 

25 డిసెంబర్ (గురువారం) - క్రిస్మస్ 


 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved