MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కరెంట్ మీటర్ లో సీక్రెట్ కెమెరా.. అమ్మాయిలను గమనిస్తూ యజమాని పైశాచికానందం...

కరెంట్ మీటర్ లో సీక్రెట్ కెమెరా.. అమ్మాయిలను గమనిస్తూ యజమాని పైశాచికానందం...

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో యువతులకు ఇళ్లు అద్దెకు ఇచ్చిన ఓ వ్యక్తి... అమ్మాయిలకు తెలియకుండా గదిలో రహస్యంగా కెమెరాలు అమర్చాడు. యువతులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు ఈ కెమెరా ద్వారా రికార్డ్ చేశాడు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 12 2023, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఓ ఇంటి యజమాని అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఇంటిని అద్దెకు ఇచ్చినట్టే ఇచ్చి ఇంట్లో రహస్య కెమెరా ఏర్పాటు చేశాడు. ఆ గదిలో అద్దెకు దిగిన యువతులు దీనిని కనిపెట్టడంతో అతని వికృత రూపం బయటపడింది. 

26

ఆ రహస్య కెమెరాను తన రూమ్ లో ఉన్న కంప్యూటర్ కు.. తన సెల్ ఫోన్ కు కనెక్ట్ చేసుకున్నాడు. యువతులు గదిలో ఉన్న సమయంలో తన సెల్ఫోన్లో రహస్య కెమెరా ద్వారా చూస్తుండేవాడు. ఈ ఘటన హైదరాబాదులోని యూసుఫ్ గూడా సమీపంలోని వెంకటగిరి హైలాం కాలనీలో వెలుగు చూసింది. 

36

ఇక్కడ ఉన్న ఓ ఇంట్లో అస్సాంకు చెందిన ఓ యువతి తన సోదరుడు, స్నేహితురాలితో కలిసి రెండు నెలల క్రితం అద్దెకు దిగింది. ఇంటి యజమాని సయ్యద్ సలీం ఆ యువతులపై  కన్నేశాడు.

46

వారి రూమ్ కి సపరేట్ మీటర్ బాక్స్ పేరుతో కొద్ది రోజుల క్రితం ఓ మీటర్ బాక్స్ ను ఏర్పాటు చేశాడు. అందులో రహస్యంగా కెమెరాను పెట్టాడు. ఆ మీటర్ బాక్స్ నుంచి వైర్ ను తన గదిలోని కంప్యూటర్కు కలిపాడు. దాంతో పాటు దాని ఇంటి చుట్టుపక్కల మరో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. వీటన్నింటిని తన సెల్ ఫోన్ కు కనెక్ట్ చేసుకున్నాడు.

56

రెండు స్పెషల్ డిజిటల్ వీడియో రికార్డర్లు ఏర్పాటు చేసుకుని ఒకదానిని యువతుల గదికి కనెక్ట్ చేశాడు. యువతులు ఇంటికి రాగానే సలీం సీక్రెట్ కెమెరాతో వారిని గమనిస్తూ ఉండేవాడు.  అయితే  అమ్మాయిలకు ఎందుకు అనుమానం వచ్చింది.  సయ్యద్ ప్రవర్తన విచిత్రంగా అనిపించేది. తమను ఎవరో గమనిస్తున్నట్లుగా అనిపించింది. దానికి తోడు మీటర్ బాక్స్ నుంచి శబ్దాలు వస్తుండేవి.. 

66
camera

camera

వెంటనే కరెంట్ మీటర్ పేరుతో ఏర్పాటు చేసిన బాక్స్ ను ఓపెన్ చేసి చూడగా.. అందులో కెమెరా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని వారు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతుల ఫిర్యాదు పోలీసులు ఇంటి యజమాని సయ్యద్ సలీం ను అదుపులోకి తీసుకున్నారు. అతని సెల్ఫోన్, కెమెరా, డివిఆర్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

About the Author

BS
Bukka Sumabala
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Recommended image2
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం
Recommended image3
IMD Rain Alert : హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved