MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Weather : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు... ఏయే జిల్లాలకు ఆరెంజ్, ఏయే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారంటే

Weather : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు... ఏయే జిల్లాలకు ఆరెంజ్, ఏయే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారంటే

తెెలుగురాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ(శనివారం) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 17 2025, 07:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Weather Updates

Weather Updates

Rain Alert : వేసవికాలం ఇంకా ముగియనేలేదు అప్పుడే వానలు మొదలయ్యాయి...  తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు గత రెండుమూడు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇవాళ(శనివారం) కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ ఈ వర్షాల కారణంగా ఎండలు తగ్గి వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. 

ఉత్తర తమిళనాడును ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉత్తర కర్ణాటక పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.  తెలంగాణ, ఏపీలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Telangana Weather

Telangana Weather

తెలంగాణ వర్షాలు : 

తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. 

ఇక ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్. హన్మకొండ, మంచిర్యాల, భువనగిరి, జనగాం, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.   

35
Andhra Pradesh Weather

Andhra Pradesh Weather

ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం :

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో కూడా వర్షతీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూల్, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

45
Andhra Pradesh Rains

Andhra Pradesh Rains

మిగతా జిల్లాల్లో వర్షాలు కురవకున్నా వాతావరణం చల్లబడుతుందని వాతావరణ తెలిపింది. అయితే పిడుగులు, ఈదురుగాలులతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.  

55
Weather

Weather

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు : 

నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ కు చేరుకున్నాయి... వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇవి చురుగ్గా ముందుకు కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముందుగా చెప్పినట్లే మే నెలాఖరుకు ఇవి కేరళ తీరాన్ని తాకుతాయని... జూన్ మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటాయని తెలిపారు. ఈ రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరిస్తే విస్తారంగా వర్షాలు కురుస్తాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Weather : ఈ రెండ్రోజులూ తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు... ఈ జిల్లాలకు హెచ్చరికలు
Recommended image2
Now Playing
Operation Sindoor: భారత్ పై దాడి చేసేవారికి అదే చివరి రోజు: CM చంద్రబాబు | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved