MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather: వారం రోజులు వాన‌లే వాన‌లు.. క్యుములోనింబస్ మేఘాల‌తో జాగ్ర‌త్త అంటోన్న అధికారులు

Weather: వారం రోజులు వాన‌లే వాన‌లు.. క్యుములోనింబస్ మేఘాల‌తో జాగ్ర‌త్త అంటోన్న అధికారులు

మే నెల ప్రారంభ‌మైంది. స‌హ‌జంగానే ఈ నెల‌లో ఎండ‌లు దంచికొడుతాయి. అయితే ఈసారి మేల నెల ప్రారంభంలో ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వ‌చ్చే వారం రోజుల పాటు ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. క్యుములోనింబ‌స్ మేఘాల కార‌ణంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఏయే ప్రాంతాల్లో వ‌ర్షం కురవ‌నుందో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Narender Vaitla
Published : May 03 2025, 07:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భారత వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం, దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వాయు గుండాల ప్ర‌భావం, ఉపరితల ఆవర్తనాల కార‌ణంగా వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా ద‌క్షిణ భార‌త దేశంలో వ‌చ్చే ఏడు రోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రానున్న ఏడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, యానాం, మహారాష్ట్ర కొంత భాగంలో వర్షాలు పడే అవకాశం ఉంది.
 

26
भीषण गर्मी के बाद दिल्लीवासियों को राहत

भीषण गर्मी के बाद दिल्लीवासियों को राहत

క్యుములోనింబ‌స్ మేఘాలు: 

క్యుములోనింబ‌స్ మేఘాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు చెబుతుంటారు. ఈ మేఘాల స్వ‌భావం విభిన్నంగా ఉంటుంది. ఇవి భారీగా తేమను మోస్తూ, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉంది. గంటకు 30–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

Related Articles

Related image1
Hyderabad: రూ. 300 కోట్లు, 6000 ఉద్యోగాలు.. హైద‌రాబాద్‌లో ప్ర‌పంచ స్థాయి బిస్కెట్ త‌యారీ కంపెనీ
36

తెలంగాణ‌లో వ‌ర్ష సూచ‌న‌: 

శ‌నివారం తెలంగాణ‌లో ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, కేసముద్రం ప్రాంతాల్లో ఉదయం 8 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు పడొచ్చు, రాత్రి 7 వరకు కొనసాగే అవకాశం ఉంది. రామగుండం, జగిత్యాల, జమ్మికుంట, బెల్లంపల్లి ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చు.

46
delhi rain

delhi rain

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వాతావ‌ర‌ణ ఎలా ఉండ‌నుందంటే.? 

కోస్తా జిల్లాల్లో ఉదయం 7 గంటల తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, పాలకొల్లు, పిడుగురాళ్ల వంటి ప్రాంతాల్లో ఉదయం 9 వరకు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

56

మచిలీపట్నం, వినుకొండ, చీరాల, ఒంగోలు, మార్కాపురం ప్రాంతాల్లో వర్షాల కురుస్తాయ‌ని అధికారులు తెలిపారు. ఇక మధ్యాహ్నం 2 తర్వాత రాయలసీమలో తిరుపతి, కడప, పులివెందుల ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే దక్షిణ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సాయంత్రం 3 తర్వాత మోస్తరు వర్షాలు పడొచ్చని అంచ‌నా వేస్తున్నారు. 

66

ఇక ఉష్ణోగ్ర‌త‌ల విష‌యానికొస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 34–37 డిగ్రీల వరకు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. అలాగే తెలంగాణలో అత్యధికంగా 40 డిగ్రీల వరకూ చేరొచ్చని అంచ‌నా వేస్తున్నారు. ఏపీలో 62 శాతం. తెలంగాణ‌లో 31 శాతం తేమ ఉండే అవ‌కాశం ఉంది.

భారీ ఈదుగు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. వడగండ్ల వ‌ర్షం కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు అధికారులు.  
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs : కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు, నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే చాలు
Recommended image2
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే
Recommended image3
Jobs: ఎలాంటి ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 17500 జీతం
Related Stories
Recommended image1
Hyderabad: రూ. 300 కోట్లు, 6000 ఉద్యోగాలు.. హైద‌రాబాద్‌లో ప్ర‌పంచ స్థాయి బిస్కెట్ త‌యారీ కంపెనీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved