గుత్తాకు శుభవార్త: హుజూర్ నగర్ నుంచి మళ్లీ సైదిరెడ్డే

First Published 27, May 2019, 2:40 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుభవార్త అందించనున్నారు. కేసీఆర్ తిరుపతి పర్యటనలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. 

కేసీఆర్ హైదరాబాద్‌కు రాగానే గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మైనంపల్లి హనుమంత రావు రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. రేపటితో నామినేషన్‌లకు గడువు ముగుస్తుంది. దీంతో గుత్తాకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభ ఎన్నిక కావడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ కానుంది. దాంతో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఉత్తమ్ సతీమణి పద్మావతిని కాంగ్రెసు పోటీకి దించే అవకాశం ఉండడంతో ధీటుగా ఎదుర్కోవడానికి గుత్తా సుఖేందర్ రెడ్డిని హుజూర్ నగర్ నుంచి కేసీఆర్ బరిలోకి దింపుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, గుత్తాను ఎమ్మెల్సీగా తీసుకోవడానికే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

గుత్తాను శాసన మండలికి ఎంపిక చేయనున్నందున హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తిరిగి శానంపూడి సైదిరెడ్డిని పోటీకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సైదిరెడ్డికి సమాచారం కూడా అందించారని తెలుస్తోంది. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 8 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు 15 రోజుల పాటు హుజూర్ నగర్ లో మకాం వేస్తారని అంటున్నారు. ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకునే బాధ్యతను కేసీఆర్ కేటీఆర్ కు అప్పగించారని అంటున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొన్ని అభివద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు

loader