మేము ఓటేశాం.. మరి మీరు? : ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు..
First Published Dec 1, 2020, 11:31 AM IST
బల్దియా ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పటివరకు 10 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. ఇప్పటి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వివిధ పోలింగ్ సెంటర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ ప్రారంభంకాగానే బంజారాహిల్స్ నందినగర్ లో మంత్రి కేటీఆర్ ఓటేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కలిసి పోలింగ్ స్టేషన్ కు చేరుకున్న ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

జూబ్లీహిల్స్ క్లబ్ లో ప్రముఖ సినీనటులు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య సురేఖతో కలిసివచ్చిన ఆయన ఓటేశారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?